భారతదేశంలో చాలా మంది ప్రైవేట్ లేదా ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ PF (Provident Fund) ఖాతాలో ప్రతి నెలా డబ్బు జమ చేస్తున్నారు. చాలామంది PF అంటే పదవీ విరమణ తర్వాత వచ్చే డబ్బు లేదా పెన్షన్ ప్రయోజనాలకు సంబంధించినదిగా మాత్రమే భావిస్తుంటారు. కానీ EPFO (Employees’ Provident Fund Organisation) PF సభ్యులకు అందించే ఒక ముఖ్యమైన ప్రయోజనం గురించి చాలామందికి తెలియదు. అది ఉచిత జీవిత బీమా కవరేజ్. EPFO అందించే ఈ బీమా విలువ రూ.7 లక్షలు వరకు ఉంటుంది. దీనిని పొందడానికి ఉద్యోగి నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోవడం జరగదు.
Read Also: UP: తల్లిదండ్రుల నిర్లక్ష్యంతో, నలిగి ప్రాణాలు కోల్పోయిన పసికందు

ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు
ఈ ఉచిత బీమా EDLI (Employees’ Deposit Linked Insurance Scheme) కింద అందించబడు తుంది. ఎవరైతే EPF ఖాతాలో కాంట్రిబ్యూషన్ చేస్తారో వారు ఆటోమేటిక్గా ఈ బీమా కవర్లోకి వస్తారు. అంటే మీరు EPF సభ్యుడైతే.. మీరు ఇప్పటికే బీమా పొందినట్లే. దీనికి ప్రత్యేకంగా ఫారమ్ పూరించాల్సిన అవసరం లేదు, రిజిస్ట్రేషన్ అవసరం లేదు, ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. EDLI పథకం EPS, EPF తర్వాత EPFO అందించే అత్యంత విలువైన ప్రయోజనాల్లో ఒకటి. ఉద్యోగి నుంచి ఒక్క పైసా కూడా తీసుకోకుండా ఈ బీమా అందించబడటం ఈ పథకం యొక్క ప్రధాన ప్రత్యేకత. ప్రీమియం మొత్తాన్ని ఉద్యోగి కాకుండా కంపెనీ చెల్లిస్తుంది. ప్రతి నెలా ఉద్యోగి మొత్తం జీతం (బేసిక్ + డియర్నెస్ అలవెన్స్) లో 0.5 శాతం EDLI పథకానికి కేటాయించబడుతుంది. ఈ మొత్తం ఉద్యోగి జీతం నుండి తగ్గించబడదు. కంపెనీ వేరుగా చెల్లిస్తుంది. దీంతో ప్రతి PF సభ్యుడు అదనపు ఖర్చు లేకుండా జీవిత బీమాను పొందగలుగుతాడు.
ఉద్యోగంలో ఉన్నంతకాలం ఈ బీమా వర్తిస్తుంది
ఈ బీమా ప్రయోజనం ఉద్యోగి మరణించినప్పుడు మాత్రమే లభిస్తుంది. మరణం ఆఫీసులో జరిగినా, ఇంట్లో జరిగినా, ప్రయాణంలో జరిగినా లేదా సెలవుల్లో జరిగినా..ఉద్యోగి ఉద్యోగంలో ఉన్నంతకాలం ఈ బీమా వర్తిస్తుంది. అలాంటి దురదృష్టకర సమయాల్లో ఉద్యోగి కుటుంబ సభ్యులు లేదా PF నామినీ ఈ బీమా మొత్తాన్ని పొందగలరు. ఇది కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పిస్తుంది. EDLI బీమా మొత్తాన్ని నిర్ణయించడంలో ఉద్యోగి చివరి 12 నెలల జీతం, PF కన్స్రిబ్యూషన్ కీలకంగా పనిచేస్తాయి. అందువలన ఉద్యోగి జీతం ఎక్కువగా ఉంటే, PF బ్యాలెన్స్ కూడా ఎక్కువగా ఉంటే, బీమా కవర్ కూడా గరిష్టంగా లభిస్తుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read also: