బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన దురదృష్టకర తొక్కిసలాట (Bengaluru Stampede ) ఘటనపై విచారణ కొనసాగుతుండగా, కేసులో కీలక మలుపు తిరిగింది. ఈ ఘటనలో ప్రాథమిక విచారణ అనంతరం పోలీసులు నలుగురిని అరెస్ట్ (Arrest) చేశారు. వీరిని ప్రత్యేక సెషన్స్ కోర్టులో హాజరుపరిచిన అనంతరం న్యాయమూర్తి 14 రోజుల న్యాయహిరాసత విధించారు.
రిమాండ్ వారిలో
రిమాండ్‌కు పంపించబడిన నిందితులలో RCB మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సోసాలే ఉన్నారు. ఆయనతో పాటు DNA ఎంటర్‌టైన్మెంట్ సంస్థకు చెందిన మరో ముగ్గురు సభ్యులు కూడా ఉన్నారు. వీరిపై తగిన అనుమతులు లేకుండానే ఈవెంట్ నిర్వహించడం, భద్రతా ప్రమాణాలను పాటించకపోవడం, భారీ జనాన్ని నియంత్రించడంలో వైఫల్యం వంటి ఆరోపణలు ఉన్నాయి. ఈ కారణంగా ఘటన తీవ్రరూపం దాల్చి, 11 మంది అమాయకుల ప్రాణాలు పోయాయి.
రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆవేదన
ఈ సంఘటనపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది. బాధిత కుటుంబాలకు న్యాయం జరగాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇక ప్రభుత్వం కూడా ఈ ఘటనను సీరియస్‌గా తీసుకుని ఇప్పటికే విచారణకు ఆదేశించింది. విచారణ ముగిసే వరకు మరిన్ని అరెస్టులు జరగే అవకాశం ఉందని సమాచారం.
Read Also : Bengaluru Stampede : సీఎం సెక్రటరీ తొలగింపు