భారత రాజకీయాల్లో, ముఖ్యంగా క్రీడా పరిపాలనా రంగంలో తనదైన ముద్ర వేసిన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి సురేష్ కల్మాడీ (Suresh Kalmadi), (81) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, పుణెలోని తన నివాసంలో ఈరోజు తెల్లవారుజామున 3:30 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, కుమారుడు, కోడలు, ఇద్దరు కుమార్తెలు, అల్లుళ్లు, మనవళ్లు ఉన్నారు.
Read also: Friedrich Merz: ఇండియాలో పర్యటించనున్న జర్మనీ ఛాన్స్‌లర్
రాజకీయ ప్రస్థానం
కుటుంబ సభ్యుల సమాచారం ప్రకారం ఇవాళ మధ్యాహ్నం 2 గంటల వరకు ఎరండవాణేలోని కల్మాడీ హౌస్‌లో ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. అనంతరం సాయంత్రం 3:30 గంటలకు పుణెలోని వైకుంఠ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కల్మాడీ (Suresh Kalmadi) మృతి పట్ల పలు పార్టీల నేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
భారత వాయుసేనలో పైలట్‌గా తన కెరీర్‌ను ప్రారంభించిన సురేశ్ కల్మాడీ, ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టి తనదైన ముద్ర వేశారు. పుణె నుంచి పలుమార్లు లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించి, కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రిగానూ బాధ్యతలు నిర్వర్తించారు. ఒక దశలో పుణె రాజకీయాల్లో అత్యంత శక్తిమంతమైన నేతగా, ‘కింగ్‌మేకర్’గా ఆయనకు పేరుండేది.

రాజకీయాలతో పాటు క్రీడారంగంలోనూ కల్మాడీ కీలక పాత్ర పోషించారు. భారత ఒలింపిక్ సంఘం (IOA) అధ్యక్షుడిగా సుదీర్ఘకాలం పనిచేశారు. ఆయన నేతృత్వంలోనే 2010లో ఢిల్లీలో కామన్వెల్త్ క్రీడలు జరిగాయి. ఈ క్రీడలు ఆయనకు మంచి గుర్తింపు తెచ్చినప్పటికీ, ఆ తర్వాత కొన్ని వివాదాలు ఆయన రాజకీయ జీవితంపై ప్రభావం చూపాయి.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: