ఒడిశాలోని రాయగడ జిల్లాలో (In Rayagada district of Odisha)ఘోరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. కాశీపూర్ సమితిలోని ఓ గ్రామానికి చెందిన ఆదివాసీ యువతి, షెడ్యూల్డ్ కులానికి చెందిన యువకుడిని ప్రేమ వివాహం చేసుకుంది. కానీ ఈ పెళ్లి (Wedding) గ్రామ పెద్దలకు భలే కళ్లగిల్లినట్టు అయింది.నూతన దంపతులు మూడు రోజుల క్రితం గ్రామానికి తిరిగివచ్చారు. వారు ఇంటికి రాగానే విషయం గ్రామ పెద్దలకు తెలిసింది. దీంతో వారు ఆగ్రహంతో వేడెక్కిపోయారు. గ్రామ సంప్రదాయాలను తుంగలో తొక్కారని, కులాంతర వివాహం village నియమాలను చెరిపేసిందని అభిప్రాయపడ్డారు.
ఊరంతా గుండు
దంపతుల కుటుంబాన్ని ఊరి వెలి నుంచి బయటపడేందుకు కఠిన నిబంధనలు విధించారు. దాదాపు 40 మంది కుటుంబ సభ్యులు, బంధువులు శిరోముండనం చేయించుకోవాలని తీర్పు చెప్పారు. దీంతో భయంతో వారు వెంటనే గుండు చేయించుకున్నారు.
మూగజీవాల బలి, బతికే వ్యక్తులకి పెద్దకర్మ
ఇంతటితో ఊరిపెద్దలు ఆగలేదు. మేకలు, గొర్రెలు, కోళ్లు, పావురాలను బలి ఇవ్వాలన్న డిమాండ్ చేశారు. అంతేకాదు, బతికే వారి కుమార్తె, అల్లుడికి పెద్దకర్మ నిర్వహించాలని ఆదేశించారు. ఇది గ్రామంలోని అందరినీ కలిచివేసింది.
బాధితుల వేదన పట్ల పోలీసుల నిర్లక్ష్యం
ఈ ఘటనపై స్థానికులు పోలీసులను అడిగితే, మాకు ఎలాంటి ఫిర్యాదు రాలేదు, అని అధికారులు స్పందించారు. ఘటనపై సమాచారం లేదంటూ చేతులు దులుపుకుంటున్నారు. ఇది ఆ ప్రాంతంలో న్యాయం ఎక్కడ ఉందో అనే చర్చకు దారితీస్తోంది.
Read Also : PM Modi : నేడు అహ్మదాబాదు కు ప్రధాని మోదీ