మహారాష్ట్ర రాష్ట్రం గత మూడు రోజులుగా విపరీత వర్షాలు(Heavy rains), వరదలతో అతలాకుతలమవుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వానల కారణంగా ఇప్పటివరకు 11 మంది ప్రాణాలు కోల్పోగా, సుమారు 41 వేల మంది నిరాశ్రయులయ్యారు. ముఖ్యంగా ముంబై, థాణే, మరఠ్వాడా ప్రాంతాలు పూర్తిగా స్థంభించిపోయాయి.
Read Also: Trump: ట్రంప్ షాక్: అమెరికాలో లక్ష మంది ఉద్యోగులు ఔట్!

సెప్టెంబర్ 27 నుంచి 29 వరకు చోటుచేసుకున్న వేర్వేరు ఘటనల్లో ఈ మరణాలు సంభవించాయి. శుక్రవారం నాందేడ్‌తో పాటు పలు ప్రాంతాల్లో ముగ్గురు వ్యక్తులు వరద ప్రవాహంలో కొట్టుకుపోయారు. అంతకుముందు రోజు నాశిక్, యావత్మాల్, జాల్నా జిల్లాల్లో ఇళ్లు కూలడం, వరదల ప్రభావంతో ఐదుగురు మృతిచెందారు. సెప్టెంబర్ 27న నాందేడ్, వార్ధా జిల్లాల్లో మరో ముగ్గురు మరణించినట్లు అధికారులు తెలిపారు.
వరదలతో అతలాకుతలమైన రాష్ట్రం – సహాయక చర్యలు ముమ్మరం
ప్రస్తుతం సోలాపూర్, జాల్నా, ఛత్రపతి శంభాజీనగర్, ధారాశివ్ జిల్లాల్లో వరదల తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ ప్రాంతాల నుంచి అధికారులు 41 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు(safe places) తరలించి, తాత్కాలిక పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. రక్షణ చర్యలు అత్యవసరంగా కొనసాగుతున్నాయి.
గత శనివారం ముంబై మహానగరంలో కురిసిన భారీ వర్షానికి రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. వర్షపాతం పరంగా అత్యధికంగా పాల్ఘర్ జిల్లాలోని తలసారిలో 208 మిల్లీమీటర్లు నమోదయ్యాయి. అలాగే ఛత్రపతి శంభాజీనగర్‌లో 120.8 మిల్లీమీటర్ల వర్షం కురిసినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. పలు ప్రాంతాలు ఇంకా నీటమునిగిన స్థితిలోనే ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
మహారాష్ట్రలో వరదల కారణంగా ఎన్ని మంది మరణించారు?
గత మూడు రోజుల్లో 11 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఎన్ని మంది నిరాశ్రయులయ్యారు?
దాదాపు 41 వేల మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: