గత కొన్ని రోజుల నుంచి వర్షాలు(Rains) బీభత్సం సృష్టిస్తున్నాయి. మధ్యప్రదేశ్, యూపీ(Madhya Pradesh, Uttara Pradesh)లో భారీ వర్షాలకు వరదలు ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి. ఇంటి నుంచి ఎక్కడికి వెళ్లలేని పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల వారి ఇళ్లు అయితే వరదలతో నిండిపోయాయి. వెంటనే అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో కాస్త విముక్తి కలిగింది.

వరదల్లో కొట్టుకొనిపోయిన జంతువులు
గత కొన్ని రోజుల నుంచి మధ్యప్రదేశ్‌లో కురిసిన వర్షాలకు 252 మంది ఇప్పటి వరకు మరణించినట్లు తెలుస్తోంది. ఎన్నో జంతువులు కూడా ఆ వరదల్లో కొట్టుకొనిపోయాయి. మూడు వేలకు మందికి పైగా ప్రజలను అధికారులు రక్షించారు. వర్షాలతో ఇబ్బంది పడుతున్న వారిని సహాయ శిబిరాలకు పంపించారు. వారికి అవసరమైన వాటిని అందిస్తున్నారు. భోపాల్, గ్వాలియర్, జబల్పూర్, ధార్‌లలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక్కడ ప్రజలను ఎన్డీఆర్‌ఫ్ బృందాలు కాపాడుతున్నాయి.
ఉత్తరాది రాష్ట్రాలకు హెచ్చరికలు..
ఇదిలా ఉండగా ఉత్తరాది రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. డిల్లీ, ఉత్తరప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ వెల్లడించింది. వచ్చే ఐదు రోజుల పాటు అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఢిల్లీలో ఉత్తర, దక్షిణతో పాటు బిహార్‌లోని గయ, పూర్తియా, పాట్నా, పశ్చిమ చంపారన్, తూర్పు చంపారన్, నవాడ, ముజఫర్‌పూర్, సివాన్, భాగల్‌పూర్‌లో భారీ వర్షాలు కురుస్తాయి. అలాగే రాజస్థాన్‌లో బుండి, అల్వార్, దౌసా, సవాయి, మాధోపూర్, కరౌలి, బరాన్, కోటలో వస్తాయ .
వరదలు ఎందుకు వస్తాయి?
వరదలు ప్రధానంగా అధిక నీటి వల్ల సంభవిస్తాయి, తరచుగా భారీ వర్షపాతం, పొంగిపొర్లుతున్న నదులు లేదా వేగంగా మంచు కరగడం వల్ల. ఇతర కారకాలు తుఫానులు, ఆనకట్ట లేదా కట్టలు విరిగిపడటం మరియు తీరప్రాంతాలలో సునామీలు కూడా.
వరద అంటే ఏమిటి ?
వరదలు అనేది ఒక రకమైన ప్రకృతి వైపరీత్యం, ఇది ప్రాణాలకు మరియు ఆస్తికి భారీ విధ్వంసం కలిగిస్తుంది. వర్షపు నీరు ఒక ప్రదేశంలో పేరుకుపోయి, జనావాస ప్రాంతాలను ముంచెత్తే పరిస్థితి ఇది. అవి అనేక మంది ప్రాణాలను కోల్పోవడానికి కూడా దారితీయవచ్చు. కొన్నిసార్లు, ఇది చాలా ప్రమాదకరమైనది మరియు మొత్తం గ్రామం లేదా నగరాన్ని తుడిచిపెట్టేస్తుంది.
READ HINDI NEWS : hindi.vaartha.com
Read Also: