మధ్యప్రదేశ్(Madhya Pradesh)లోని సివనీలో శిక్షణా విమానం(Flight Crash) ల్యాండింగ్ సమయంలో ప్రమాదానికి గురైంది. సుక్తరా ఎయిర్ స్ట్రిప్‌కు చేరువలో ఉన్న ఆమ్గావ్ గ్రామం వద్ద హైటెన్షన్ పవర్ లైన్లను ఢీకొని విమానం నేలపై కూలిపోయింది. ఈ ఘటనలో పైలట్ అజిత్ ఛావ్డా సహా మరో వ్యక్తి గాయపడ్డారు.
Read also: కుక్కకాటు భయాందోళన.. రోజుకు 300 మందికి పైగా ఆస్పత్రికి క్యూ
సివని విమాన ప్రమాదంతో 90 గ్రామాలకు విద్యుత్ నిలుపుదల
స్థానికులు, విద్యుత్ శాఖ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని బయటకు తీశారు. బాధితులను ఆసుపత్రికి తరలించగా, వారు ప్రాణాపాయంలో లేరని వైద్యులు తెలిపారు.
విమానం ఢీకొట్టడంతో విద్యుత్ తీగలు తెగిపోవడంతో సుమారు 90 గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని అధికారులు తెలిపారు. సంఘటనపై విచారణ కొనసాగుతోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: