గత మూడు రోజులుగా నిర్వహణలో లోపాలు, సిబ్బంది సమస్యల కారణంగా దేశీయ విమానయాన సంస్థ ఇండిగో కార్యకలాపాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అనూహ్యంగా ఎన్నో విమానాలు రద్దు(Flight Cancellations) కావడంతో ప్రయాణికులు విమానాశ్రయాల్లో ఇబ్బందులు పడుతున్నారు. పరిస్థితి మెరుగయ్యే సూచనలు కనిపించకపోవడంతో ప్రయాణికుల ఆగ్రహం మరింత పెరిగింది. శుక్రవారం రోజునే 400కు పైగా విమానాలు రద్దు కావడం సమస్యను మరింత క్లిష్టం చేసింది. వీటిలో సగానికి పైగా ఢిల్లీ విమానాశ్రయానికి చెందినవే.
Indian aviation news : ఇండిగోకు షాక్ ఒక్కరోజే 550 ఫ్లైట్లు రద్దు, ఆపరేషన్లు…

ప్రధాన విమానాశ్రయాల్లో పెద్ద ఎత్తున సర్వీసుల రద్దు
ఢిల్లీ ఎయిర్‌పోర్టులో(Delhi Airport) 220కు పైగా, బెంగళూరులో 100కు పైగా, హైదరాబాద్‌లో 90 కంటే ఎక్కువ సర్వీసులను( Flight Cancellations) ఇండిగో రద్దు చేసింది. ఇతర ప్రధాన విమానాశ్రయాల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. విమానాలు రద్దయినందున ప్రయాణికులు గంటల తరబడి విమానాశ్రయాల్లోనే ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ప్రయాణికుల ఇబ్బందులు పెరిగిన విధానం
చాలా విమానాశ్రయాల్లో ప్రయాణికులు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు.
- ఇండిగో కౌంటర్లు ఖాళీగా ఉన్నాయని
- సిబ్బంది స్పందించడం లేదని
- ఆహారం, నీరు అందించకపోవడంపై
- లగేజీ కోసం 12 గంటలకు పైగా వేచి ఉండాల్సి వస్తోందని
అనేక మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లాంజ్‌లలో చోటు లేక నేలపై నిద్రించే పరిస్థితి ఏర్పడింది. ఇదే సమయంలో ఇండిగో షేర్లు కూడా వరుసగా పడిపోతూ శుక్రవారం 9% కంటే ఎక్కువ నష్టాన్ని చవిచూశాయి.
సమస్యల నేపథ్యంలో ఇండిగో తీసుకున్న చర్యలు
తాజా పరిణామాల నేపథ్యంలో ఇండిగో సంస్థ DGCAను సంప్రదించి,
- ఎయిర్‌బస్ A320 విమానాలకు FDTL నిబంధనల నుంచి తాత్కాలిక మినహాయింపు ఇవ్వాలని కోరింది.
ఈ ఉపశమనం ఫిబ్రవరి 10, 2025 వరకు ఇవ్వాలని ఇండిగో అభ్యర్థించింది. DGCA ఇంకా తుది నిర్ణయాన్ని ప్రకటించలేదు.
ఇండిగో ప్రకారం, విమాన సర్వీసులు పూర్తిగా సవ్య స్థితికి రావడానికి ఫిబ్రవరి 10 తర్వాతే అవకాశం ఉంటుంది. డిసెంబర్ 8 నుంచి కొన్ని సర్వీసులను తగ్గించనున్నట్లు సంస్థ వెల్లడించింది. ప్రయాణికులకు క్షమాపణలు కూడా తెలిపింది.
హైదరాబాద్, విశాఖలో పరిస్థితి ఉద్రిక్తం
హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో 92 సర్వీసులు రద్దు కావడంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు.
- వీటిలో 43 రాక విమానాలు
- 49 వెళ్లే విమానాలు ఉన్నాయి.
చెక్–ఇన్ పూర్తయ్యాక విమాన రద్దు సమాచారాన్ని ఇవ్వడంపై ప్రయాణికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
విశాఖపట్నం నుంచి కూడా 8 సర్వీసులు రద్దు అయ్యాయి. ఇవి హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్ రూట్లకు చెందినవి.
అయ్యప్ప భక్తుల కోసం ప్రత్యేక విమాన సదుపాయం
ఇండిగో రద్దుల వల్ల శబరిమలకు వెళ్లాల్సిన భక్తులు చిక్కుల్లో పడిన నేపథ్యంలో, ఏపీ మంత్రి పార్థసారథి జోక్యం చేసుకున్నారు. కేంద్రమంత్రి రామ్మోహన్‌తో మాట్లాడి భక్తుల కోసం ప్రత్యేక విమాన సదుపాయం కల్పించించారు. తనకు వెళ్లాల్సిన విజయవాడ విమానం రద్దు కావడంతో పార్థసారథి రోడ్డు మార్గం ద్వారా బయలుదేరినా, అయ్యప్ప భక్తులు ఆయన సహాయానికి ధన్యవాదాలు తెలిపారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: