ఐసియులో చెలరేగిన మంటలు.. 8మంది మృతి
ప్రాణాలను కాపాడుకునేందుకు ఆసుపత్రిలో చేరితే ఆ ప్రాణాలే బలైపోయాయి. రాజస్థాన్ లోని జైపూర్ లో ఉన్న సవాయ్ మాన్ సింగ్ ప్రభుత్వ ఆస్పత్రిలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్న ఎనిమిదిమంది రోజులు మృతి చెందారు. క్షతగాత్రుల వివరాలు వెల్లడి కాలేదు. స్టోరేజ్ ఏరియాలో(Storage area) మంటలు చెలరేగిన సమయంలో ఐసీయూలో 11మంది రోగులకు చికిత్స అందిస్తున్నామని డాక్టర్ అనురాగ్ తెలిపారు. అగ్నిప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణంగా భావిస్తున్నామని పోలీసులు చెప్పారు. ప్రధాని మోదీ ఈ ఘటనపై స్పందించి, మరణించిన వారికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
Read Also: Floods: భూటాన్ వరదల్లో చిక్కుకుపోయిన వేలాదిమంది?
బాధ్యులపై చర్యలుంటాయి: సీఎం
అగ్నిమాపక సిబ్బంది సుమారు రెండుగంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. మొదట పొగ అలుముకున్న సమయంలోనే ఆస్పత్రిని సిబ్బందిని వాచ్చరించినా వారు పట్టించుకోలేదని రోగుల తరపున బంధువులు ఆరోపించారు. మరోవైపు ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ వెంటనే అక్కడికి చేరుకున్నారు. సవాయ్ మాన్ సింగ్ ఆస్పత్రిని సందర్శించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు నిర్వహించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. దీనిపై పూర్తిస్థాయి దర్యాపు కోసం ఆరుగురు సభ్యులతో ఒక కమిటినీ రాజస్థాన్ ప్రభుత్వం(Government of Rajasthan) ఏర్పాటు చేసింది.
సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ప్రమాదం: బంధువులు
ప్రమాద సమయంలో కొంతమంది రోగులను వారి పడకలతో సహా ఆసుపత్రి నుంచి బయటకు తీసుకువచ్చామని తెలిపారు. భద్రతాపరమైన లోపాలు ఉన్నాయని మరణించిన బంధువులు ఆరోపిస్తున్నారు. ‘రాత్రి 11:20 గంటల ప్రాంతంలో పొగ వ్యాపించడం ప్రారంభమైందని, ఇది రోగులకు అసౌకర్యాన్ని కలిగిస్తుందని వైద్యులకు సూచించామని, పొగ తీవ్రమయ్యే సమయానికి వైద్యులు, కాంపౌండర్లు బయటకు పారిపోయారని, ఈ సమయంలో ఐదుగురు రోగులను మాత్రమే బయటకు తరలించారు, ఈ ప్రమాదంలో మా అల్లుడు మరణించాడు’ అంటూ ఓ రోగి బంధువు వాపోయారు. ‘నా తల్లిని ఐసీయూలో చేర్చాను. మొదట స్పార్క్ వస్తున్నట్లుగా గమనించి వైద్యులకు తెలియజేశాను. కానీ దాన్ని వాళ్లు పట్టించుకోలేదు. ఆకస్మాత్తుగా పొగ చుట్టుముట్టడంతో అంతా పరుగుతు తీశారు. నా సోదరుడు అతికష్టం మీద బయటకు తీసుకొచ్చాం కానీ, అతని పరిస్థితి విషమంగా ఉంది’ అని మరో రోగి బంధువు వాపోతున్నారు. ప్రమాదంపై జైపూర్ పోలీస్ కమిషనర్ బిజు జార్జ్ జోసెఫ్ మాట్లాడుతూ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లుగా భావిస్తున్నామన్నారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఘటన ఎక్కడ మరియు ఎప్పుడు జరిగింది?
రాజస్థాన్‌లోని జైపూర్‌లోని సవాయ్ మాన్ సింగ్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో ఐసీయూలో 11 మంది రోగులకు చికిత్స అందిస్తున్నారని తెలిపారు.
ఈ అగ్నిప్రమాదంలో ఎన్ని మంది మృతి చెందారు?
ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: