పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసం చేసి భారత్ నుంచి పరారైనా వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీను భారత్ కు తీసుకొచ్చే ప్రయత్నాలు ఓ కొలిక్కి వచ్చింది. బ్రిటన్లో దాక్కున్న అతడిని నవంబరు 23న భారత్ తీసుకొచ్చే అవకాశం ఉందంటూ జతీయ మీడియాలో కథనాలు ప్రచురితం అయ్యాయి. బ్రిటన్[Britain] లో భారత దర్యాప్తు సంస్థలు చేస్తున్న న్యాయపోరాటం ఫలించినట్టు తెలుస్తోంది. కోట్లాది రూపాయలను బ్యాంకుకు మోసగించి, విదేశాలకు పారిపోయిన నీరవ్ రెండుమూడు దేశాల్లో తలదాచుకుంటూ వచ్చారు. బెల్గామ్, బ్రిటన్ వంటి దేశాల్లో తిరిగి, ఇప్పుడు మళ్లీ బ్రిటన్ లో ఉంటున్నారు. ఆయనపై నేరపూరిత కుట్ర, మోసం, ఆస్తి పంపిణీ, అవినీతి, మనీలాండరింగ్ వంటి కేసులు ఉన్నాయి. నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీ, విజయ్ మాల్యా వంటి బహుళ మిలియన్ డాలర్ల కుంభకోణాలలో పాల్గొన్న వ్యాపారవేత్తలను భారత ప్రభుత్వం అరెస్టు చేయడంలో విఫలం కావడంతో వీరు విదేశాలకు పారిపోయి, అక్కడే జీవిస్తున్నారు.
Read also : కొనసాగుతున్న షట్ డౌన్.. నిధులను నిలిపేసిన ట్రంప్

పూచీకత్తు లేఖతో మార్గం క్లీయర్
నీరవ్ మోదీని ఆర్థిక మోసం, మనీ లాండరింగ్ తప్ప మరే ఇతర అభియోగాల గురించి విచారించేది లేదంటూ అధికారిక పూచీకత్తుతో ఓ లేఖను ఇటీవలే బ్రిటీష్ సర్కారుకు, భారత ప్రభుత్వం అందించింది. సీబీఐ, ఈడీ, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్[Investigation] ఆఫీస్, కస్టమ్స్ అండ్ ఇన్కమ్ ట్యాక్స్ విభాగం సంయుక్తంగా ఈ పూచీకత్తు లేఖను బ్రిటన్ ప్రభుత్వం ఉన్నతాధికారులకు సమర్పించాయి. కాగా నీరవ్ మోదీని ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలుకు తరలిస్తారని సమాచారం.
నీరవ్ మోదీని భారత్‌లోకి ఎప్పుడు తీసుకొస్తారు?
బ్రిటన్‌లో న్యాయపోరాటం కొనసాగుతూనే, నవంబర్ 23న భారత్‌కు తీసుకురావచ్చని వివరాలు ఉన్నాయి.
ఆయనపై ఉన్న ప్రధాన కేసులు ఏమిటి?
- ఆర్థిక మోసం, మనీ లాండరింగ్, అవినీతి, ఆస్తి పంపిణీ, నేరపూరిత కుట్ర వంటి కేసులు ఉన్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Read Also: