మ్యాంగో పల్ప్ జిఎస్టీని తగ్గించాలి
చిత్తూరు : చిత్తూరు(Farmers) జిల్లాలోని మామిడి పల్ప్ ఫ్యాక్టరీలు రైతులకు షాక్ ఇచ్చాయి. ఫ్యాక్టరీలకు మామిడి సరఫరా చేసి ఐదు నెలలు కావస్తున్నప్పటికీ ఫ్యాక్టరీలు ఇప్పటి వరకు మామిడి రైతులకు చెల్లించాల్సిన డబ్బులు చెల్లించలేదు. ప్రభుత్వం కేజీ మామిడిఫై ఫ్యాక్టరీలు రూ.8 చెల్లించాలని ఆదేశించింది. అలాగే ప్రభుత్వం మామిడి రైతుకు కేజీపై రూ.4 ప్రోత్సాహక ధర చెల్లింపులు ఇప్పటికే పూర్తి చేసింది. ఈ మేరకు ప్రభుత్వం కేజీపై రూ.4 చొప్పున జిల్లాలోని మామిడి రైతులకు రూ.183 కోట్లు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. మామిడి రైతులకు పల్ప్ ఫ్యాక్టరీలు చెల్లించాల్సిన చెల్లింపులపై సోమవారం కలెక్టరేట్లోని నాగార్జున ఐఎఎస్ వీడియో కాన్ఫరెన్స్ హాలులో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు, కలెక్టర్ సుమిత్కుమార్, పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోన్లు. పల్స్ ఫ్యాక్టరీల యాజమానులతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ఫ్యాక్టరీలు రైతులకు చెల్లించాల్సిన చెల్లింపులపై క్లారిటీ రాలేదు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి రాంప్రసాదొడ్డి రైతుల క్షేమం దృష్టిలో వుంచుకుని ఫ్యాక్టరీలు దాతృత్వంతో ధరలు చెల్లించాలన్నారు. ఫ్యాక్టరీలు ఒక నిర్ధేశిత సమయం నిర్ణయించుకుని ఆ మేరకు రైతులకు చెల్లించాల్సిన చెల్లింపులు చేపట్టి పూర్తి చేయాలన్నారు. ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు మాట్లాడుతూ పల్స్ ఫ్యాక్టరీ లకు మామిడి రైతులకు మామిడి సరఫరా చేసి ఐదు నెలలు కావస్తున్నప్పటికీ ప్రభుత్వం నిర్దేశించిన ధరను మాత్రం ఫ్యాక్టరీలు ఇప్పటి వరకు చెల్లించలేదన్నారు.
ఒక పార్టీని నాలుగు ముక్కలు చేసిన ఉపఎన్నిక

జీఎస్టీ తగ్గింపు, మ్యాంగో బోర్డు ఏర్పాటు డిమాండ్
ఫ్యాక్టరీలు రైతులకు(Farmers) ఒక కేజీపై ఏ మేరకు ధర చెల్లించాలనుకుంటున్నాయి! ఏ తేదీల్లో రైతులకు చెల్లింపులు చేస్తారనే విషయాలను సమగ్రంగా వివరణ ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వం ఆదేశించిన మేరకు కేజీపై రూ.8 చెల్లించడానికి వీలు లేని పక్షంలో మామిడి రైతులకు కేజీకి ఏ మేరకు ధర చెల్లిస్తారనే విషయంపై ఫ్యాక్టరీలు కలెక్టర్కు ప్రతిపాదించాలన్నారు. కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో ఈ మామిడి సీజన్లో లో 2.40 లక్షల మెట్రిక్ టన్నుల మామిడిని రైతులు పల్ప్ ఫ్యాక్టరీలకు సరఫరా చేశారన్నారు. మామిడి రైతులకు ప్రభుత్వం ఇప్పటికే ఒక కేజీపై రూ.4 ప్రోత్సాహక ధరను వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసిందన్నారు. ఫ్యాక్టరీలు కేజీ మామిడికి రూ.8 చెల్లించాలని ప్రభుత్వం ఆదేశించిందని, అయితే ఇప్పటి వరకు ఏ ఒక్క ఫ్యాక్టరీ రైతుకు ఈ మేరకు ధర చెల్లించలేదన్నారు. జిల్లాలో కొన్ని పల్ప్ ఫ్యాక్టరీలు తమిళనాడు(Tamil Nadu) రాష్ట్రం కృష్ణగిరిలో చెల్లిస్తున్న ధరల కంటే తక్కువగా మామిడి రైతులకు చెల్లిస్తున్నా యన్నారు. మామిడి ధరలపై ఫ్యాక్టరీ యాజమా నులు, మామిడి రైతులు పరస్పర సహకారంతో ముందుకు వెళ్ళాలన్నారు.
ఈ సమావేశంలో పల్ప్ ఫ్యాక్టరీల యాజమానులు సైతం తమ బాధలు వెళ్ళకక్కారు. యూరోపియన్ దేశాల్లో దిగుమతి సుంకాలు అధికం కావడంతో తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, అలాగే మ్యాంగో పల్ప్ జిఎస్టీని తగ్గించాలని, జిల్లాలో మ్యాంగో బోర్డును ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సమావేశంలో మామిడి రైతులకు పల్ప్ ఫ్యాక్టరీలు ప్రభుత్వం ఆదేశించిన మేరకు కేజీకి రూ.8 చెల్లింపుపై క్లారిటీ లభించకపోగా, ఏ మేరకు ధర చెల్లించాలని భావిస్తున్నారో కలెక్టర్కు ప్రతిపాదించాలని చెప్పడంతో జిల్లాలోని మామిడి రైతులకు కేజీపై రూ.8 ధర అమలు జరిగేలా కన్పించడం లేదని రైతులు భావిస్తున్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: