ఫాల్కన్ (Falcon) స్కామ్ కేసులో కీలక పురోగతి లభించింది. ఆ సంస్థ ఎండీ అమర్ దీప్‌ను ముంబైలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతను గల్ఫ్ నుంచి ముంబైకి రాగా ఇమిగ్రేషన్ అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అతనిపై ఇప్పటికే తెలంగాణ పోలీసులు లుక్‌అవుట్ నోటీసులు జారీ చేశారు. MNC కంపెనీల్లో పెట్టుబడుల పేరుతో చేసిన రూ.850 కోట్ల స్కామ్‌లో అమర్‌దీప్ ప్రధాన నిందితుడిగా ఉన్నారు.
Read also: Bangladesh: హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య

పలు ఆరోపణలు
హైటెక్ సిటీ కేంద్రంగా క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థను స్థాపించిన అమర్‌దీప్.. ఫాల్కన్ (Falcon) పేరుతో ఒక మొబైల్ యాప్‌ను రూపొందించాడు. అమెజాన్, బ్రిటానియా, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ ఎంఎన్‌సీ (MNC) కంపెనీల ఇన్వాయిస్‌లను డిస్కౌంట్‌కు కొనుగోలు చేస్తామని, అందులో పెట్టుబడి పెడితే ఏడాదికి 11 శాతం నుంచి 22 శాతం వరకు లాభాలు ఇస్తామని పలువురిని నమ్మించారు. అలా బాధితుల నుంచి సుమారు రూ.1,700 కోట్లు వసూలు చేసినట్లు అతడిపై పలు ఆరోపణలు ఉన్నాయి.
అయితే అందులో రూ.850 కోట్లు తిరిగి చెల్లించినప్పటికీ.. మిగిలిన రూ.850 కోట్లతో నిందితులు బోర్డు తిప్పేశారు. దీంతో దాదాపు 7 వేల మందికి పైగా బాధితులు ఆందోళనతో రోడ్డెక్కారు. అయితే ఎండీ అమర్‌దీప్ తన ప్రైవేట్ జెట్ విమానంలో దుబాయ్‌కు పరారయ్యాడు. ఈ కేసును విచారిస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ఇప్పటికే అమర్‌దీప్‌కు చెందిన రూ.18 కోట్ల విలువైన ఆస్తులను పలు లగ్జరీ కార్లను సీజ్ చేసింది. బాధితుల నుంచి వసూలు చేసిన సొమ్మును క్రిప్టో కరెన్సీ, రియల్ ఎస్టేట్,విదేశీ షెల్ కంపెనీలకు మళ్లించినట్లుగా అధికారులు గుర్తించారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: