సైబర్ నేరగాళ్లు(Cyber Crime) ప్రజలను మోసగించేందుకు కొత్త కొత్త పన్నాగాలు పన్నుతున్నాయి. తాజాగా SBI కస్టమర్లను లక్ష్యంగా చేసుకుని నకిలీ వాట్సాప్(FakeMessage Alert) సందేశాలను పంపిస్తున్నారు. “ఆధార్ అప్డేట్ చేయకపోతే మీ SBI YONO యాప్ బ్లాక్ అవుతుంది” అంటూ భయపెడుతూ, SBI లోగోను ప్రొఫైల్ పిక్చర్‌గా వేసి నమ్మకం కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సందేశాలతో పాటు ఒక APK ఫైల్ పంపిస్తూ, దాన్ని ఇన్‌స్టాల్ చేస్తే YONO అప్డేట్ అవుతుందని చెబుతున్నారు. అయితే, ఈ ఫైళ్లను క్లిక్ చేసిన వెంటనే వినియోగదారుల ఫోన్‌లో మాల్వేర్ ఇన్‌స్టాల్ అయ్యే ప్రమాదం ఉంది. దీని ద్వారా బ్యాంక్ వివరాలు, OTPలు, పర్సనల్ డేటా మొత్తం సైబర్ నేరగాళ్ల చేతికి వెళ్లే అవకాశం ఉంది.
Read Also: Bank Scam: బ్యాంకు మోసం అల్ఫలా యూనివర్సిటీ చైర్మన్ సోదరుడు అరెస్టు

PIB Fact Check ఇప్పటికే స్పష్టం చేసింది—
SBI ఎలాంటి APK ఫైళ్లను పంపదు
ఆధార్ అప్డేట్ లేకపోతే YONO బ్లాక్ అవుతుందనేది పూర్తిగా ఫేక్ మెసేజ్
వాట్సాప్ ద్వారా SBI ఎప్పుడు డౌన్‌లోడ్ లింకులు పంపదు
ప్రజలు ఇలాంటి మెసేజ్‌లను(FakeMessage Alert) వెంటనే డిలీట్ చేసి, ఎలాంటి లింకులు, ఫైళ్లను ఓపెన్ చేయవద్దని సైబర్ భద్రతా నిపుణులు సూచిస్తున్నారు. బ్యాంక్‌కు సంబంధించిన ఏ సందేహమైనా నేరుగా SBI అధికారిక యాప్ లేదా వెబ్‌సైట్‌లో చెక్ చేయడం మంచిది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: