Maharashtra: మహారాష్ట్రలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. నాగ్‌పూర్ జిల్లాలోని ఉమ్రేడ్ తాలూకాలోని ఒక కర్మాగారంలో శుక్రవారం జరిగిన పేలుడులో ఎనిమిది మంది మరణించారని నాగ్‌పూర్ గ్రామీణ పోలీసులు తెలిపారు. నాగ్‌పూర్ గ్రామీణ ఎస్పీ హర్ష్ పొద్దార్ మాట్లాడుతూ.. ఫ్యాక్టరీ పాలిష్ చేసిన ట్యూబింగ్ యూనిట్‌లో 87 మంది కార్మికులు లోపల ఉన్నారని తెలిపారు. ట్యూబింగ్ యూనిట్ లోపల పేలుడు జరిగిందని చెప్పారు. ఈఘటనలో పలువురు కూడా గాయపడ్డారు. గాయపడ్డ వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డ వారిలో ఇద్దరు చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృతి చెందారని చెప్పారు.

పాలిష్ చేసిన ట్యూబింగ్ విభాగంలో పేలుడు
ఫ్యాక్టరీ ఉమ్రేడ్ తాలూకాలో ఉంది. పాలిష్ చేసిన ట్యూబింగ్ విభాగంలో పేలుడు జరిగింది. మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకురాలేదు. అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తమయ్యారు. మంటలను ఆర్పే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి అని పొద్దార్ తెలిపారు. ప్రస్తుతం ప్రభావిత ప్రాంతంలోకి ప్రవేశించడం సురక్షితం కాదని ఆయన అన్నారు. మంటలు ఆరిన తర్వాత, సరైన దర్యాప్తు ప్రారంభమవుతుంది అని తెలిపారు.