ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ పర్వతం ప్రాంతంలో మంచు బీభత్సంతో పర్వతారోహకులు ఇబ్బందులు పడుతున్నారు. గతవారం రోజులుగా హిమపాతం, మంచు తుపాను వల్ల వెయ్యిమందికి పైగా పర్వతారోహకులు ఎవరెస్ట్ (Everest) పై చిక్కుకుపోయారు.
Crime News: ఛత్తీస్‌గఢ్ లో ఘోర రోడ్డుప్రమాదం-ఐదుగురు మృతి
అక్టోబర్ నెలలో ఎవరెస్ట్ పర్వతంపై ఇలాంటి మంచుతుపాన్లు అసాధారణం. చైనా నేషనల్ డే సందర్భంగా పెద్ద సంఖ్యలో పర్వతారోహకులు ఎవరెస్ట్ బేస్ క్యాంపు (Everest Base Camp) వెళ్లారు. మార్గమధ్యలో ‘కర్మ వ్యాలీ’లో మంచుతుపాను వారిని ఇబ్బందులను గురి చేసింది.
సహాయక చర్యలు చేస్తున్న చైనా అధికారులు
ట్రెక్కర్లు చిక్కుకుపోయినట్లు సమాచారం అందుకున్న వెంటనే చైనా అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు.టిబెట్ బ్లూ స్కై రెస్క్యూ టీమ్, స్థానిక అధికారులు సంయుక్తంగా రెస్క్యూ ఆపరేషన్ (Rescue operation) నిర్వహిస్తున్నారు.
రోడ్లపై, ట్రెక్కింగ్ మార్గాల్లో పేరుకపోయిన భారీ మంచును తొలగించి, చిక్కుకున్న వారిని రక్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రెస్క్యూ ఆపరేషన్ లో భాగంగా ఇప్పటికే 350 మందికిపైగా ట్రెక్కర్లను సురక్షితంగా ‘ఖుడాంగ్’ అనే చిన్న పట్టణానికి తరలించినట్లు చైనా మీడియా వెల్లడించింది.
మిగిలిన ట్రెక్కర్లను సంప్రదించగలిగినట్లు, వారిని కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. తీవ్రమైన చలి, హైపోథెర్మియా ముప్పు ఉన్నందున రెస్క్యూ టీమ్లు జాగ్రత్తగా పనిచేస్తున్నాయి.
విపరీతమైన మంచు కురవడంతో చాలా టెంట్లు కూలిపోయినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ ప్రాంతానికి తాత్కాలికంగా టికెట్ల విక్రయాన్ని నిలిపివేశారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: