ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఉద్యోగ భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ (EPFO) అత్యంత కీలకమైన సమాచారాన్ని అందించింది. పీఎఫ్ ఖాతాదారులు తమ ఖాతాలోని నగదు నిల్వను సరిచూసుకోవడం, అత్యవసర సమయాల్లో డబ్బును విత్‌డ్రా చేయడం లేదా పాస్‌బుక్ వివరాలను డౌన్లోడ్ చేసుకోవడం వంటి ఆన్లైన్ సేవలను పొందాలంటే ఇకపై యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) యాక్టివేషన్ తప్పనిసరి అని స్పష్టం చేసింది. ఎవరి యూఏఎన్ నంబర్ అయితే యాక్టివేషన్లో ఉండదో, అటువంటి చందాదారులకు ఎటువంటి ఆన్లైన్ సేవలు అందుబాటులో ఉండవని ఈపీఎఫ్ఓ తేల్చి చెప్పింది.
Read Also: Trump : ప్రపంచాన్ని వెనక్కి నడిపిస్తున్న ట్రంప్

సోషల్ మీడియా వేదికగా అవగాహన
ఈ నిబంధనపై అవగాహన కల్పించేందుకు ఈపీఎఫ్ఓ తన అధికారిక సోషల్ మీడియా ‘ఎక్స్’ (ట్విట్టర్) ఖాతాలో ఒక పోస్టును ఉంచింది. ఈపీఎఫ్ సేవలు నిరంతరాయంగా పొందాలంటే యూఏఎన్ యాక్టివేషన్ తప్పనిసరి అని పేర్కొంటూ, చందాదారులు తమ నంబర్‌ను సులభంగా ఎలా యాక్టివేట్ చేసుకోవాలో వివరించే ఆరు దశల విధానాన్ని కూడా అందులో పొందుపరిచింది. పీఎఫ్ ఖాతా ఉన్న ప్రతి ఉద్యోగి వెంటనే ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవడం ద్వారా భవిష్యత్తులో క్లెయిమ్స్ లేదా ఇతర సేవల విషయంలో ఎలాంటి సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవచ్చని సూచించింది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: