हिन्दी | Epaper
ఏపీలో సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ప్రకటన ప్రయాణికులకు శుభవార్త: టోల్ ఛార్జీలు భరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు క్యాబినెట్‌ కీలక నిర్ణయం గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు కొత్త వాహనాలపై 10% రోడ్ సేఫ్టీ సెస్ ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతుల్లో కీలక మార్పులు నేరస్తులకు సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్.. టెక్నాలజీతో చెక్! ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ ఉల్లి రైతులకు ఒక్కొక్కరికి రూ.20వేలు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల హాజరు తప్పనిసరి ఏపీలో సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ప్రకటన ప్రయాణికులకు శుభవార్త: టోల్ ఛార్జీలు భరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు క్యాబినెట్‌ కీలక నిర్ణయం గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు కొత్త వాహనాలపై 10% రోడ్ సేఫ్టీ సెస్ ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతుల్లో కీలక మార్పులు నేరస్తులకు సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్.. టెక్నాలజీతో చెక్! ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ ఉల్లి రైతులకు ఒక్కొక్కరికి రూ.20వేలు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల హాజరు తప్పనిసరి ఏపీలో సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ప్రకటన ప్రయాణికులకు శుభవార్త: టోల్ ఛార్జీలు భరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు క్యాబినెట్‌ కీలక నిర్ణయం గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు కొత్త వాహనాలపై 10% రోడ్ సేఫ్టీ సెస్ ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతుల్లో కీలక మార్పులు నేరస్తులకు సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్.. టెక్నాలజీతో చెక్! ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ ఉల్లి రైతులకు ఒక్కొక్కరికి రూ.20వేలు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల హాజరు తప్పనిసరి ఏపీలో సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ప్రకటన ప్రయాణికులకు శుభవార్త: టోల్ ఛార్జీలు భరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు క్యాబినెట్‌ కీలక నిర్ణయం గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు కొత్త వాహనాలపై 10% రోడ్ సేఫ్టీ సెస్ ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతుల్లో కీలక మార్పులు నేరస్తులకు సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్.. టెక్నాలజీతో చెక్! ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ ఉల్లి రైతులకు ఒక్కొక్కరికి రూ.20వేలు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల హాజరు తప్పనిసరి

Environmental protection: పర్యావరణ పరిరక్షణ ఎన్నికల ప్రచారాస్త్రం కావాలి

Sudha
Environmental protection: పర్యావరణ పరిరక్షణ ఎన్నికల ప్రచారాస్త్రం కావాలి

దేశ, రాష్ట్ర పాలకులు అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెడు తున్నారు. ప్రత్యేకంగా సమ్మిట్లు నిర్వహిస్తూ ప్రపంచ పెట్టుబడిదారులను ఆహ్వానిస్తున్నారు. పెట్టుబడులు పెట్టాల నుకునే పారిశ్రామిక వేత్తలతో ఉదారంగా వ్యవహరి స్తున్నారు. వందలు, వేల ఎకరాలు కేటాయిస్తున్నారు. అందుకో సం వ్యవసాయ భూములు, నివాస స్థలాలను సేకరించ డమే కాకుండా అడవులనూ అప్పనంగా అప్పగించేస్తున్నారు. దీంతో పర్యావరణానికి తీవ్ర హాని జరుగుతున్నది. అభివృద్ధిపర్యావరణ పరిరక్షణను(Environmental protection) సరిసమానంగా చూడకపోవడంతో ఈ పరిస్థితి ఉత్పన్నమవుతున్నది. పరిస్థితులు మరింత దిగజారుతుండడంతో ప్రజలు ఇప్పుడిప్పుడే మేల్కొంటున్నారు. అయితే అధికారంలోకి రావడానికి హామీల వరద పారించే జాతీయ, ప్రాంతీయ పార్టీలు పర్యావరణ పరిరక్షణను (Environmental protection) ఎన్నికల్లో ప్రధాన హామీగా ఎందుకు ప్రకటించడంలేదు అనే ప్రశ్న సహజంగానే ఉత్పన్న మవుతున్నది. ప్రపంచ టాప్ టెన్ కాలుష్య నగరాల్లో ఐదు నుంచి ఏడువరకు నగరాలు భారత దేశంలోనే ఉండడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తున్నాయి. ఈ నగరాల్లో నమోదవుతున్న ఏక్యూఐ స్థాయిలు ప్రజారో గ్యానికి తీవ్రముప్పుగా కురిణమిస్తున్నాయి. పారిశ్రామిక కాలు ష్యం వల్ల రాజస్థాన్లోని బివాడిలో 300 నుంచి 400 మధ్య ఏక్యూఐ నమోదు అవుతున్నది. దేశ రాజధాని ఢిల్లీలో అయితే శీతాకాలంలో ఏక్యూఐ400నుంచి 500వరకు చేరుకుంటున్నది. వాహనాల పొగ, నిర్మాణ ధూళి, పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే పొగమంచు ఆ నగర గాలిని ప్రమాద కరంగా మారుస్తున్నాయి. ఉత్తరప్రదేశ్లోని ఫజియాబాద్, నోయిడా నగరాల్లో కూడా ఏక్యూఐ తరచూ 250 నుంచి 350 మధ్య ఉంటున్నది. హర్యానాలోని గురుగ్రామ్, ఫరీ దాబాద్ నగరాల్లో వేగవంతమైన పట్టణీకరణ, పరిశ్రమల విస్తరణ కారణంగా ఏక్యూఐ 200 నుంచి 300 మధ్య కొనసాగుతున్నది. దీంతో ప్రజలు తీవ్ర అనారోగ్యాల బారిన పడుతున్నా.. పాలకులు తగినంత చర్యలు తీసుకోవడంలోకవిఫలమవుతున్నారు.

Read Also: http://Crime 2025:నేరాల్లో మహిళల పాత్ర: దేశాన్ని కుదిపేసిన సంచలన కేసులు

Environmental protection
Environmental protection

ప్రపంచంలోనే అతి పురాతన పర్వత శ్రేణుల్లో ఒకటైన ఆరావళి పర్వతాలపై కేంద్ర నిర్ణయాలు, వాటిని సుప్రీం కోర్టు ఆమోదించడం ఇటీవల తీవ్ర చర్చనీయాంశమైంది. ఆరావళి పర్వతాలు ఉత్తర భారతానికి ఊపిరితిత్తుల్లాంటివి. ఈ కొండలు రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ ప్రాంతాల్లో వాతావరణ సమతుల్యను కాపాడడంలో కీలక పాత్ర పోషస్తాయి. అయితే గనుల తవ్వకాలు, నిర్మాణ ప్రాజె క్టుల పేరిట ఈ ప్రాంతంలో జరుగుతున్న మార్పులు పర్యా వరణవేత్తలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఈ నేపథ్యం లో పర్యావరణానికి జరుగుతున్న హానిని గుర్తించిన ప్రజలు రాజస్థాన్ లోని జైపూర్, ఉదయ్పూర్, హర్యానాలోని గురు గ్రామ్లో శాంతియుత నిరసనలు చేపట్టారు. ముఖ్యంగా జెన్ జీ యువత బయటకు వచ్చి నిరసనలు తెలపడమే కాకుం డా సేవ్ ఆరావళి హ్యాష్ ట్యాగ్తో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారంచేస్తూ నిరసన తెలుపుతున్నది. వాయు కాలుష్యం దేశవ్యాప్తంగా మహమ్మారిలా విస్తరిస్తున్నది. శ్వాసకోశ వ్యాధులు, గుండె సంబంధిత సమస్యలు, పిల్లల్లో అస్తమ కేసులు పెరుగు తున్నాయి. నగరాల్లో పాఠశాలలు మూసివేయాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. అయితే ఇవన్నీ ఎన్నికల రాజకీయాల్లో పెద్ద అంశాలుగా మారడం లేదు. రోడ్లు, వంతెనలు, పరిశ్రమల అభివృద్ధి గురించి పెద్ద హామీలు వినిపిస్తున్నాయే కానీ ఆ అభివృద్ధి వల్ల వచ్చే కాలుష్యాన్ని ఎలా నియంత్రిస్తామన్న స్పష్టమైన ప్రణాళికలు కనిపించడం లేదు. రైతు, ఉద్యోగం, కులం, మతం వంటి అంశాలు ఎన్నికల్లో ప్రభావం చూపిస్తుండగా పర్యావరణం ప్రభావం చూపే అంశంగా రాజకీయ నేతలు భావించడం లేదు.

Environmental protection
Environmental protection

పర్యావరణ పరిరక్షణ ఫలితాలు ఐదేళ్లలో కనిపించవు. అవి దీర్ఘకాలంలో మాత్రమే తెలుస్తాయి. అవి ప్రజలను ఎలాప్రభావితం చేయగలుగుతాయి అనే ప్రశ్నలు రాజకీయ నాయకుల నుంచే వినిపిస్తున్నాయి. అందుకే ఐదేళ్లలో ఫలి తం చూపించలేని హామీలపై రాజకీయ పార్టీలు ఆసక్తి చూపించడం లేదనేఅభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎంత మందికి రుణమాఫీ చేస్తాం? ఎన్ని ఉచిత పథకాలు ఇస్తాం? ఏకులానికి ఎంత రిజర్వేషన్ కల్పిస్తాం? అనే అంశా లపై ఉన్న శ్రద్ధ, మీ పిల్లలకు స్వచ్ఛమైన గాలిని, కలుషితం లేని నీటిని అందిస్తాం అనే అంశాలు రాజకీయ పార్టీలకు, నాయకులకు కనిపించడంలేదు. అయితే ఐదేళ్ల కాలపరిమి తితో ఆలోచించే నేతలకు దీర్ఘకాలిక దృష్టి లేకపోవడం అస లు సమస్య. అంతేకాకుండా పారిశ్రామికవేత్తల విరాళాలపై నడిచే రాజకీయ వ్యవస్థ. పర్యావరణ చట్టాలను కఠినతరం చేయడానికి వెనకాడుతున్నది. ప్రజల డిమాండ్లలో మార్పు వస్తేనే.. రాజకీయ పార్టీల ప్రాధాన్యతల్లో మార్పు వస్తుంది. పర్యావరణ పరిరక్షణకు ప్రణాళికలతో కూడిన స్పష్టమైన హామీలు ఇచ్చే నేతలు, పార్టీలకు ప్రజలు మద్దతు తెలిపితే రాజకీయ పార్టీలు, నాయకుల్లోనూ మార్పు వచ్చే అవకాశ ముంటుంది. తద్వారా పర్యావరణ పరిరక్షణ జరిగి.. భవి ష్యత్ తరాలకు మేలు జరుగుతుంది. ఓటర్లు ప్రశ్నిస్తేనే రాజ కీయాలుమారుతాయి. అయితే ఆ మార్పు ఆలస్యమైతే దాని మూల్యం దేశం మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. అయితే అభివృద్ధి, పర్యావరణం రెండూ పరస్పర విరుద్ధమైనవి కావని రాజకీయ వ్యవస్థగ్రహించాల్సిన అవసరముంది.
-మహమ్మద్ ఆరిఫ్

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870