ఢిల్లీ నగర రవాణా వ్యవస్థలో విప్లవాత్మక మార్పుకు రంగం సిద్ధమైంది ప్రభుత్వం తాజాగా ప్రారంభించబోతున్న ‘మొహల్లా ఎలక్ట్రిక్ బస్ సర్వీస్’ ఈ మార్పుకు నాంది పలికేలా ఉంది. అధికారికంగా దీన్ని ‘ఢిల్లీ ఎలక్ట్రిక్ వెహికల్ ఇంటర్‌చేంజెస్’ అని, సంక్షిప్తంగా ‘దేవి (DEVI)’ అని పిలుస్తున్నారు ఈ సేవలు ఏప్రిల్ 22, 2025న ప్రారంభమవుతాయని అధికారులు స్పష్టం చేశారు.ఈ కొత్త బస్సులు ప్రధానంగా మెట్రో స్టేషన్ల నుంచి నివాస ప్రాంతాలకు కనెక్టివిటీ కల్పించేందుకు రూపొందించబడ్డాయి. రోజూ వందలాది మంది ప్రయాణికులు ‘లాస్ట్ మైల్ కనెక్టివిటీ’ సమస్యను ఎదుర్కొంటున్నారు. దేవి బస్సుల రాకతో ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరకనుంది.ప్రారంభ దశలో 9 మీటర్ల పొడవుగల 255 బస్సులు సేవలందించనున్నాయి. ఇవి ప్రత్యేకంగా ఇరుకైన వీధుల్లో తేలికగా తిరగగలిగేలా డిజైన్ చేయబడ్డాయి. ఒక్కో బస్సులో 23 సీట్లు ఉంటాయి పూర్తిగా ఛార్జ్ చేస్తే 200 కిలోమీటర్ల ప్రయాణం సునాయాసంగా చేయగలవని అధికారులు చెబుతున్నారు.

ఈ ఎలక్ట్రిక్ బస్సుల టికెట్ ధరలు ప్రస్తుత ఏసీ బస్సుల మాదిరిగా రూ.10 నుంచి రూ.25 మధ్య ఉంటాయి. ప్రతి బస్సులో మహిళల కోసం ప్రత్యేకంగా 6 సీట్లు కేటాయించారు ముఖ్యంగా, ఢిల్లీ ప్రభుత్వం అమలు చేస్తున్న ‘పింక్ పాస్’ పథకం కింద మహిళలు ఈ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు.పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకొని రూపొందించిన ఈ సేవలు కాలుష్య నియంత్రణకు ఎంతో తోడ్పడతాయి.
డీజిల్ బస్సులతో పోలిస్తే, ఈ ఎలక్ట్రిక్ బస్సులు ధ్వని మరియు వాయు కాలుష్యాన్ని గణనీయంగా తగ్గిస్తాయి. అంతేగాక, రవాణా ఖర్చును తగ్గించడంలో కూడా ఇవి కీలక పాత్ర పోషిస్తాయి.‘దేవి’ సర్వీసులలో మొదటి రూట్ (MS-1) అక్షర్ధామ్ మెట్రో స్టేషన్ నుంచి మయూర్ విహార్ ఫేజ్-3 వరకు నడుస్తుంది. ఈ మార్గం త్రిలోక్‌పురి, కళ్యాణ్‌పురి వంటి కీలక ప్రాంతాల మీదుగా సాగుతుంది. ప్రజలకు ఇది రోజువారీ ప్రయాణాల్లో ఎంతో ఉపశమనం కలిగించనుంది.ఈ ప్రాజెక్ట్‌కి విస్తృత రూపం ఇవ్వాలని ఢిల్లీ ప్రభుత్వం భావిస్తోంది. 2025 చివరికి 2,000కు పైగా ఎలక్ట్రిక్ బస్సులను సేవలోకి తీసుకురావాలన్నది వారి ప్రణాళిక. దీని ద్వారా నగరంలో పర్యావరణ హితమైన, సుస్థిర రవాణా వ్యవస్థను బలోపేతం చేయవచ్చని అధికారులు చెబుతున్నారు.
Read Also : Vehicle Speed : రోడ్లపై స్పీడ్ చెక్ కోసం కేంద్రం కీలక నిర్ణయం