రాజ్ కుంద్రాకు ఈడీ గట్టి దెబ్బ – బిట్‌కాయిన్ Bitcoin మనీలాండరింగ్ కేసులో ఛార్జిషీట్, శిల్పాశెట్టి పేరు ప్రస్తావన బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రాకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ED పెద్ద షాక్ ఇచ్చింది. సంచలనాన్ని రేపిన బిట్‌కాయిన్ మనీలాండరింగ్ Money laundering వ్యవహారంలో ఈడీ తాజాగా ఛార్జిషీట్ దాఖలు చేసింది. అందులో కుంద్రా పేరు మాత్రమే కాకుండా, ఆయనపై పలు తీవ్రమైన ఆరోపణలు కూడా ఉంచింది. ఈడీ ఆరోపణల ప్రకారం – బిట్‌కాయిన్ మోసం కేసులో ప్రధాన నిందితుడు అమిత్ భరద్వాజ్ నుంచి రాజ్ కుంద్రా 285 బిట్‌కాయిన్లు (విలువ సుమారు రూ.150 కోట్లు) పొందారు. అయితే ఈ లావాదేవీలను కుంద్రా దాచిపెట్టారని, బిట్‌కాయిన్ వాలెట్ వివరాలు కూడా బహిర్గతం చేయలేదని ఛార్జిషీట్‌లో స్పష్టం చేసింది. ప్రస్తుతం ఆ క్రిప్టోకరెన్సీ ఆయన నియంత్రణలోనే ఉందని, వాటి ద్వారా లాభాలు పొందుతున్నారని కూడా పేర్కొంది.
India-America: కొత్త మలుపు భారత్, అమెరికాల మధ్య చర్చలు

Shilpa Shetty
శిల్పా–కుంద్రా
అదనంగా, తన ఆదాయాన్ని బహిరంగం చేయకుండా ఉండేందుకు రాజ్ కుంద్రా Raj Kundra భార్య శిల్పాశెట్టితో ఆర్థిక ఒప్పందం కుదుర్చుకున్నారని ఈడీ ED పత్రాల్లో పేర్కొనడం ప్రత్యేక దృష్టి ఆకర్షిస్తోంది. ఇక ఇదే సమయంలో, శిల్పా–కుంద్రా దంపతులు మరో మోసం కేసులోనూ ఇరుక్కున్నారు. ఒక వ్యాపారవేత్తను రూ.60 కోట్ల మేర మోసం చేశారన్న ఆరోపణలతో ఇటీవల ముంబై పోలీసులు రాజ్ కుంద్రాను విచారించారు. ఆ కేసులో భాగంగా వారిద్దరిపై లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. తాజా ఛార్జిషీట్‌తో ఈ దంపతులు న్యాయపరంగా మరింత క్లిష్ట పరిస్థితుల్లోకి వెళ్లినట్టయింది.
రాజ్ కుంద్రాపై ఈడీ ఎందుకు ఛార్జిషీట్ దాఖలు చేసింది?
బిట్‌కాయిన్ మనీలాండరింగ్ కేసులో ఆయనకు అమిత్ భరద్వాజ్ నుంచి రూ.150 కోట్ల విలువైన బిట్‌కాయిన్లు అందాయని, వాటిని దాచిపెట్టారని ఈడీ ఆరోపించింది.
ఈ కేసులో శిల్పాశెట్టిపేరు ఎందుకు ప్రస్తావనలోకి వచ్చింది?
తన ఆదాయాన్ని దాచిపెట్టేందుకు రాజ్ కుంద్రా, భార్య శిల్పాశెట్టితో ఆర్థిక ఒప్పందం చేసుకున్నారని ఈడీ ఛార్జిషీట్‌లో పేర్కొంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: