భూటాన్ లగ్జరీ కార్ల స్మగ్లింగ్ కేసు (Bhutan luxury car smuggling case) ప్రస్తుతం దక్షిణ భారత సినీ పరిశ్రమలో పెద్ద సంచలనం రేపుతోంది. ఈ కేసు వెనుక ఉన్న ఆర్థిక అవకతవకలు, నకిలీ పత్రాల వినియోగం, అంతర్జాతీయ స్మగ్లింగ్ నెట్వర్క్ వంటి అంశాలపై దర్యాప్తు సాగుతోంది. ఈ కుంభకోణంలో అనేక ప్రముఖులు పేర్లు వెలుగులోకి రావడంతో, సినిమా రంగం మొత్తం ఉలిక్కిపడింది.
Bigg Boss: కన్నడ బిగ్ బాస్ హౌస్ క్లోజ్.. కారణమిదే?
ఈ నేపథ్యంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) (ED) అధికారులు బుధవారం ఉదయం పెద్ద ఎత్తున దాడులు ప్రారంభించారు. కేరళలోని కోచ్చి, తిరువనంతపురం, ఎర్నాకుళం, అలాగే తమిళనాడులోని చెన్నై, కోయంబత్తూరు ప్రాంతాల్లో సుమారు 17 ప్రదేశాలను అధికారులు లక్ష్యంగా చేసుకున్నారు. ఈ దాడులు ఏకకాలంలో జరగడం ఆసక్తికరంగా మారింది.
ఈ కేసులో ప్రముఖ నటులు మమ్ముట్టి, ఆయన కుమారుడు దుల్కర్ సల్మాన్, (Mammootty, Dulquer Salmaan) పృథ్వీరాజ్ సుకుమారన్, అమిత్ చక్కలక్కల్ వంటి వారి పేర్లు బయటకు రావడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈడీ అధికారులు వీరి నివాసాలతో పాటు సంబంధిత ప్రొడక్షన్ కంపెనీల ఆఫీసులు, లగ్జరీ కార్ల డీలర్ల వద్ద సోదాలు నిర్వహించారు.

అక్రమంగా వాహన రిజిస్ట్రేషన్లు పొందినట్లు
విదేశీ మాదక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) ఉల్లంఘనల ఆరోపణలపై ఈడీ (ED) ఈ చర్యలు చేపట్టింది. భూటాన్, నేపాల్ మార్గాల ద్వారా టయోటా ల్యాండ్ క్రూయిజర్, ల్యాండ్ రోవర్ డిఫెండర్ వంటి ఖరీదైన వాహనాలను అక్రమంగా దిగుమతి చేస్తున్న ఓ ముఠాపై తమకు కచ్చితమైన సమాచారం అందిందని ఈడీ అధికారులు తెలిపారు.
ఈ ముఠా భారత సైన్యం, అమెరికా రాయబార కార్యాలయం, విదేశాంగ మంత్రిత్వ శాఖ పేరుతో నకిలీ పత్రాలు సృష్టించి, అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో అక్రమంగా వాహన రిజిస్ట్రేషన్లు పొందినట్లు అధికారులు గుర్తించారు. ఆ తర్వాత ఈ కార్లను సినీ ప్రముఖులతో సహా పలువురికి తక్కువ ధరకు విక్రయించినట్లు ఆరోపణలున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: