Mallikarjun Kharge : పార్టీ జనరల్ సెక్రటరీలు, ఇంఛార్జీల సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..వక్ఫ్ (సవరణ) చట్టంలో పలు అంశాలపై కాంగ్రెస్ సహా ఇతర విపక్ష పార్టీలు లేవనెత్తిన అంశాలకు సుప్రీం కోర్టు కూడా ప్రాధాన్యం కల్పించిందని పేర్కొన్నారు. వక్ఫ్ ఆస్తులపై వివాదాన్ని సృష్టించేందుకే ప్రభుత్వం వక్ఫ్ బై యూజర్ అంశాన్ని లేవనెత్తిందన్నారు. ప్రతీకార రాజకీయాల్లో భాగంగానే ఈడీ ఛార్జిషీటులో సోనియా, రాహుల్ పేర్లను పేర్కొన్నారని మల్లికార్జున ఖర్గే ఆరోపించారు.

వరి పేర్లు పెట్టుకున్నా.. భయపడే ప్రసక్తే లేదు
ప్రతీకార రాజకీయాల్లో భాగంగానే ఇవన్నీ జరుగుతున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు అని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే పేర్కొన్నారు. పెద్ద కుట్రలో భాగంగానే నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీటులో సోనియా, రాహుల్ గాంధీ పేర్లను పెట్టారని తెలుస్తుంది. ఎవరి పేర్లు పెట్టుకున్నా.. భయపడే ప్రసక్తే లేదు. దీనికి రెండు, మూడు రోజుల ముందే ఢిల్లీ, లఖ్‌నవూ, ముంబయిల్లోని నేషనల్ హెరాల్డ్ ఆస్తులను అటాచ్ చేశారు.
వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత తమపై ఉంది
బీజేపీ వాళ్లు అబద్ధాలు చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. యంగ్ ఇండియన్ అనేది లాభార్జన కంపెనీ కాదని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ఉద్ఘాటించారు. వీటి షేర్లు, ఆస్తులు లేదా లాభాలను ఎవ్వరూ తీసుకోలేరని, బదిలీ కూడా చేసుకోలేరని అన్నారు. ఇక, నేషనల్ హెరాల్డ్ కేసులో షేర్లు కారుచౌకగా బదలాయించుకుని రూ.కోట్ల ఆస్తుల్ని కొల్లగొట్టేశారని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన అభియోగపత్రంలో పేర్కొన్న విషయం తెలిసిందే. రూ.988 కోట్ల మేర అక్రమ నగదు చలామణికి సోనియా, రాహుల్‌లు పాల్పడ్డారని అందులో ఆరోపించింది.
Read Also: 60 ఏళ్ల వయసులో పెళ్లి పీటలెక్కిన బీజేపీ నేత