భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యంగా గుర్తింపు పొందిన దేశం. కానీ అదే సమయంలో ప్రపంచంలో అత్యధిక ఆర్థిక, సామాజిక, లింగ, ప్రాంతీయ అసమానతలు ఉన్న దేశాలలో ఒకటిగా కూడామారుతోంది. ప్రపంచం అభివృద్ధి, వృద్ధి రేటు, జాతీయ స్థూల ఉత్పత్తి (జీడీపీ) అనే పదాలతో మత్తెక్కిపోతున్న ఈ కాలంలో, ఈ ప్రశ్నకు నిర్దాక్షిణ్యమైన సమాధానం చెప్పే రీతిలో ఉన్నదే ప్రపంచ అసమానతల నివేదిక (వరల్డ్ ఇనీక్వాలిటీ రిపోర్ట్). అభివృద్ధి అనే పదం గణాంకాల్లో మెరుస్తున్నా, ఆ అభివృద్ధి ఫలాలు సమానంగా ప్రజలందరికీ అందుతున్నాయా? అభివృద్ధి ఫలాలు ఎవరి చేతుల్లోకి వెళ్తున్నాయి? అనే ప్రశ్న మరింత కీలకంగా మారింది. ఈ రోజు భారత సమాజం ముందు నిలిచిన కఠిన సత్యం. వరల్డ్ ఇనీక్వాలిటీ రిపోర్ట్ తాజా నివేదిక, గత కొన్నేళ్ల గణాంకాలు ఒక స్పష్టమైన సంకేతం ఇస్తున్నాయి. ప్రపంచ సంపద పెరుగుతోంది, కానీ సమానత్వం తగ్గుతోంది. ఈ ప్రపంచ ధోరణిలో భారత దేశం
ఒక ప్రధాన ఉదాహరణగా నిలుస్తోంది. వేగవంతమైన ఆర్థిక వృద్ధి, డిజిటలైజేషన్, మౌలిక సదుపా యాలనిర్మాణం ఇవన్నీ ఒకవైపు కనిపిస్తే, మరోవైపు పెరుగుతున్న అసమానతలు భారత ప్రజాస్వామ్యానికి సవాలుగా మారుతున్నా యి. అసమానతలు సంఖ్యల సమస్య కాదు, సమాజ నిర్మాణ సమస్య. అసమానత అనగానే చాలామంది దానిని పేద, ధనిక మధ్య తేడాగా మాత్రమే చూస్తారు. కానీ ప్రపంచ అసమానతల నివేదిక (వరల్డ్ ఇనీక్వాలిటీ రిపోర్ట్) చెబుతున్నది వేరే విషయం. అసమానతలంటే ఆదాయంలో తేడా, సంపదలో కేంద్రీకరణ, అవకాశాలలో లోపం, విద్య, ఆరోగ్యం, ఉపాధిలో అసమాన పంపిణీ, కుల, లింగ, ప్రాం తీయ వివక్షలు. ఇవన్నీ కలిసినప్పుడు ఒక దేశం నిజంగా అభివృద్ధి చెందిందా లేదా అన్నది తెలుస్తుంది. భారతదేశం స్వాతంత్రం పొందిన తరువాత ప్రజలందరికి ఒక గొప్ప హామీ ఇచ్చింది. ఆ హామీ పేరు సమానత్వం. కులం, మతం, లింగం, ఆర్థిక స్థితి ఆధారంగా ఎవ్వరూ వెనుకబడకూడదు అన్నది డా. బి.ఆర్. అంబేద్కర్ దృష్టిలో అసమానత ఒక ఆర్థిక సమస్య కాదు. ఆయన అసమానతను కేవలం ఆదా యం లేదా పేదరిక సమస్యగా చూడలేదు. ఆయనదృష్టిలో అసమానత అనేది సామాజిక నిర్మాణం, కుల వ్యవస్థ ఫలితం, ఆర్థిక దోపిడీకి పునాది, రాజకీయ ప్రజాస్వామ్యానికి ప్రధాన అడ్డంకి అని స్పష్టంగా చెప్పారు. సామాజిక సమా నత్వం లేకుండా రాజకీయ ప్రజాస్వామ్యం నిలబడదు అని స్పష్టంగా చెప్పారు. అంటే రాజకీయంగా సమానత్వం, సామాజికంగా అసమానత ఈ విరుద్ధత కొనసాగితే ప్రజా స్వామ్యం ప్రమాదంలో పడుతుందని ఆయన హెచ్చరించారు. నేడు అదే జరుగుతోంది.
Read Also : http://Pan Card: డిసెంబర్ 31లోపు ఈ పనులు చేయకపోతే భారీ జరిమానా!

కుల వ్యవస్థ
డా.బి.ఆర్. అంబేద్కర్ దృష్టిలో సమానత్వంభారత రాజ్యాంగం ఆర్టికల్ 14 ( సమానత్వం), ఆర్టికల్ 15 (వివక్ష నిషేధం), ఆర్టికల్ 17 (అంటరానితనం రద్దు) చేసింది. కానీ వాస్తవంలో కుల వివక్ష కొనసాగుతోంది, ఆర్థిక అసమానత పెరుగుతోంది, అవకాశాలు సమానంగా లేవు అంబేద్కర్భయపడిన పరి స్థితి ఇదే. ఆర్థిక అసమానతలపై అంబేద్కర్ ఆలోచన ఒక అపోహని తీవ్రంగా ఖండించారు. ముందు ఆర్థిక సమానత్వం వస్తే, సామాజిక సమానత్వం వస్తుంది అన్న వాదనను ముం దుచారు. కానీ ఆయన చెప్పింది సామాజిక అసమానత ఉన్నంత కాలం, ఆర్థిక సమానత్వం (Economic equality)అసాధ్యం. భూమి, వనరులు, పరిశ్రమలు కొద్దిమంది చేతుల్లో ఉంటే, పేద వర్గాలు ఎప్పటికీ విముక్తి పొందలేరని ఆయనవెల్లడించారు. అంబేద్కర్ రాజకీయ పార్టీలను ప్రజాస్వామ్యానికి అవసర మైన సాధనంగా చూశారు. కానీ ఆయన ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పారు. నేడు రాజకీయ పార్టీలు అధికార సాధనకే పరిమితమవుతున్నాయి కానీ, కులం, మతం, భావోద్వే గాల మీద రాజకీయాలు చేస్తున్నాయి. అసమానతల మూలాలపై మాట్లాడటం లేదు. ఇది అంబేద్కర్ ఆశించినరాజకీయ సంస్కృతి కాదు. భారతదేశంలోని అసమానతల మూలం కుల వ్యవస్థ. కులం జన్మతో నిర్ణయించబడుతుంది, వృత్తి జన్మతోనే బంధించబడుతుంది. గౌరవం కూడా కులంతోనే కొలవబడుతుంది. ఇది ఆర్థిక అసమానతకు మాత్రమేకాదు, మనుషుల మధ్య మానవత్వం లేని విభజనకు కారణమవు తుంది. అంబేద్కర్ కుల వ్యవస్థను ఒకరు పైగా, మరొకరు కిందగా ఉండే వ్యవస్థ అని వెలిబుచ్చారు.
పన్ను విధానాలు
ప్రపంచంలో, భారతదేశంలోని అత్యంత ధనిక ఒక శాతం వర్గం అపూర్వ మైన సంపదను సొంతం చేసుకుంటోంది, మధ్యతరగతి వర్గం క్రమంగా క్షీణిస్తోంది. కోవిడ్ అనంతరం పేదరికం తగ్గినట్టు కనిపించినా, అసమానత మరింత పెరిగింది. ప్రభు త్వాలు పన్ను విధానాల ద్వారా సంపదను పునర్విభజించ డంలో విఫలమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో భారతదేశం” ఎమర్జింగ్ ఎకానమీగా ప్రశంసలు పొందుతున్నప్పటికీ, అస మానతల విషయంలో ప్రపంచంలోనే ముందంజలో ఉన్న దేశాల జాబితాలోకి చేరుతోంది. భారత ఆర్థిక (Economic equality)వ్యవస్థ వేగం గా పెరుగుతోందని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. కానీ వరల్డ్ ఇనీక్వాలిటీ నివేదిక వెల్లడించేది ఈ వృద్ధి ఎవరి జీవితాలను మార్చింది అని. భారతదేశంలో సంపద కేంద్రీకరణ అత్యంత ధనిక ప్రజలు దేశ సంపదలో భారీ భాగాన్ని నియంత్రిస్తున్నారు, మరోవైపు, దేశంలోని క్రింది 50 శాతం ప్రజలకు కలిపి ఉన్నసంపద అత్యంతస్వల్పం. ఇది స్వాతంత్ర్యానంతరం ఎప్పుడూ లేని స్థాయిలో సంపద కేంద్రీకరణ పెరిగిందని నివేదికల ధోరణులు సూచిస్తున్నా యి. ఆదాయంకంటే సంపదలోనే తీవ్ర అసమానత, భారత దేశంలో ఆదాయ అసమానత కంటే సంపద అస మానత చాలా ప్రమాదకరంగా మారింది. సంపద అంటే భూమి, ఇళ్లు, పరిశ్రమలు, షేర్లు, వారసత్వ ఆస్తులు, ప్రభుత్వ భూములు, ఖనిజ సంపదలు, ఈ ఆస్తులు కొద్దిమంది చేతుల్లోనే కేంద్రీ కృతమవుతున్నాయి. దీని ఫలితంగా పేద కుటుంబాలు తర తరాలుగా పేదలుగానే మిగిలిపోతున్నాయి, ధనిక కుటుంబా లు మరింత ధనికులవుతున్నాయి, ఇది సామాజిక చలనశీల తను పూర్తిగా దెబ్బతీస్తోంది. భారత దేశంలో విద్య, ఆరోగ్యం ఖర్చులు క్రమంగా పెరుగుతున్నాయి. ఉద్యోగ భద్రత తగ్గు తోంది, ఆదాయం స్థిరంగా పెరగడం లేదు, సామాజిక అసంతృప్తి పెరుగుతోంది. ఇది
దీర్ఘకాలంలో దేశస్థిరత్వానికే ముప్పుగా మారే ప్రమాదముంది.

ఉపాధి లేని వృద్ధి
ఉపాధి లేని వృద్ధితో అసమానతలకు ప్రధాన కారణం, భారతదేశ ఆర్థిక వృద్ధి ఒక ప్రధాన లోపంతో ముందుకెళ్తంది. యువతలో నిరుద్యోగం పెరుగుతోంది, అనధికార రంగం విస్తరిస్తోంది, కాంట్రాక్ట్, గిగ్ ఉద్యోగాలు పెరిగి భద్రత తగ్గుతోంది. వరల్డ్ ఇనీక్వాలిటీ రిపోర్ట్ సూచన ఏమిటంటే ఉద్యోగాలు సృష్టించని అభివృద్ధి అసమానతలను తప్పనిసరిగా పెంచుతుందని. కులం, లింగం, ప్రాంతం ఇలా బహుముఖ అసమానతలు, భారత అసమా నత కేవలం ఆర్థికమేకాదు, అది సామాజికంగా కూడా ఉంది. మహిళల శ్రామికంగా పాల్గొనే రేటు తక్కువ. మహిళల ఆదాయం పురుషులతో పోలిస్తే గణనీయంగా తక్కువ, కుల అసమానత, ఎస్సీ, ఎస్టీ వర్గాలు ఇంకా భూమి, విద్య, ఉపాధిలో వెనుకబడి ఉన్నాయి. ప్రాంతీయ అసమానతలు కొన్ని రాష్ట్రాలు వేగంగా అభివృద్ధి చెందుతుంటే, మరికొన్ని రాష్ట్రాలు మౌలిక సదుపాయాలకే నోచుకోలేకపోతున్నాయి. ఇవన్నీ కలిపి భారతదేశాన్ని బహుముఖ అసమానతల దేశం గా మారుస్తున్నాయి. ప్రపంచ అసమానతల నివేదిక ప్రకారం భారతదేశానికి ఇచ్చే సందేశం సుస్పష్టంగా తెలియజేసింది, అసమానతలను పట్టించుకోని అభివృద్ధి చివరకు ప్రజాస్వా మ్యానికే ప్రమాదం. ఇది కేవలం ఆర్థిక నివేదిక కాదు, ఇది పాలకులకు ఒక హెచ్చరిక లాంటిది, ప్రజలకు ఒక అద్దం లాంటిది, రాజ్యాంగానికి ఒక స్మరణ లాంటిది. భారతదేశం ఈ హెచ్చరికను గమనిస్తే సమానత్వం ఉన్న దేశంగా మారే అవకాశం ఉంది. అంబేద్కర్ హెచ్చరికలు నేటికీ నిజమవుతు న్నాయి. అసమానతలపై పోరాటం లేకుండా భారత ప్రజా స్వామ్యం నిలబడదని, భారతదేశం ఒకసమానత్వప్రయోగం. ఆ ప్రయోగం విజయం సాధించాలంటే రాజకీయ పార్టీలు రాజ్యాంగానికి విధేయులవ్వాలి, ప్రజలు సమానత్వానికికాప లాదారులవ్వాలని వక్కాణించారు. అసమానతలను పట్టించు కోని అభివృద్ధిచివరకు ప్రజాస్వామ్యానికే ప్రమాదం, అందుకే రాజ్యాంగాన్ని కాపాడుకుంటూ ప్రభుత్వం, వ్యవస్థలు చేసే తప్పులను ప్రజలే పోరాటాల రూపంలో ఎత్తిచూపిస్తూ అన్నింటిలోనూ సమానత్వాన్ని సాధించుకోవాలి.
-డా. ఎ . భాగ్యరాజ్
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: