దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) (EC) శ్రీకారం చుట్టేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ‘ప్రత్యేక సవరణ (Special Intensive Revision)’ ఈ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి వివరాలను నేటి సాయంత్రం 4:15 గంటలకు జరగనున్న ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ప్రకటించనున్నారు. ఇందుకోసం ఈసీ (EC) , మీడియా ప్రతినిధులకు ఆహ్వానాలు పంపింది.
Read Also: Karur Tragedy: కరూర్ దుర్ఘటన బాధిత కుటుంబాలతో విజయ్ భేటీ
ఎన్నికల సంఘం మీడియాకు పంపిన ఆహ్వానంలో కేవలం ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నట్లు మాత్రమే పేర్కొంది. అయితే, ఇది పూర్తిగా ఓటర్ల జాబితాల సవరణకు సంబంధించిన ప్రకటనకేనని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా (List of Voters) ను నూటికి నూరు శాతం కచ్చితత్వంతో సిద్ధం చేసే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు.తొలి దశలో భాగంగా 10 నుంచి 15 రాష్ట్రాల్లో ఈ ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని ప్రకటించవచ్చని తెలుస్తోంది. ముఖ్యంగా 2026లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలకు ఇందులో ప్రాధాన్యం ఇవ్వనున్నారు.
రాష్ట్రాల్లో ఓటర్ల జాబితాను పక్కాగా
వచ్చే ఏడాది (2026) తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, అసోం, పుదుచ్చేరి రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఈ రాష్ట్రాల్లో ఓటర్ల జాబితాను పక్కాగా సిద్ధం చేసేందుకు ఎన్నికల సంఘం ఈ సవరణ ప్రక్రియను మొదటగా చేపట్టనుంది. ఈ ప్రకటనతో ఎన్నికల సందడి మొదలైనట్టేనని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: