హర్యానా ఎన్నికల్లో ఓటు చోరీ ఆరోపణలు
హర్యానా(EC)అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన ఓటింగ్ ప్రక్రియపై రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద కలకలాన్ని రేపాయి. ఆయన పేర్కొన్న 25 లక్షల ఓట్లు చోరీ వ్యాఖ్యను బీజేపీ తీవ్రంగా ఖండించింది. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థపై దుష్ప్రచారం చేయడమేనని బీజేపీ నేతలు వ్యాఖ్యానించారు. కాగా, కాంగ్రెస్ వర్గాలు మాత్రం రాహుల్ ఆరోపణలను సమర్థిస్తున్నాయి. ఎన్నికల వ్యవస్థలో ఉన్న లోపాలను బహిర్గతం చేయడమే ఆయన ఉద్దేశమని అంటున్నారు.
Read also: రెండో పెళ్లికి ముందు భార్య అంగీకారం తప్పనిసరి: కేరళ హైకోర్టు

ఎన్నికల సంఘం ప్రతిస్పందన రాహుల్‌కు కౌంటర్ ప్రశ్నలు
ఇక ఎన్నికల సంఘం (ECI) కూడా రాహుల్ గాంధీ(Rahul Gandhi) వ్యాఖ్యలపై దూకుడుగా స్పందించింది. గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్(EC) ఏజెంట్లు, ప్రతినిధులు ఎటువంటి లిఖిత పూర్వక ఫిర్యాదు చేయలేదని స్పష్టం చేసింది. ఓటరు జాబితా సవరణ ప్రక్రియ పారదర్శకంగా జరిగిందని, ప్రతి పార్టీకి పరిశీలన అవకాశం ఇచ్చామని తెలిపింది. ఈ నేపథ్యంలో రాహుల్ ఆరోపణలపై దర్యాప్తు అవసరం లేదని ఈసీ వర్గాలు సూచిస్తున్నాయి.
ఇదిలా ఉండగా, రాహుల్ గాంధీ తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకునే అవకాశం లేదని, తాను చెప్పినది వాస్తవమని తన సోషల్ మీడియా పోస్ట్ ద్వారా మరోసారి పునరుద్ఘాటించారు. ప్రజాస్వామ్యంలో ఓటు పవిత్రమైనది, దానిపై ఎలాంటి చోరీ జరుగకూడదు. నేను పోరాటం ఆపను అంటూ స్పష్టం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: