Movie review : పేరు: Drive
రిలీజ్ డేట్: డిసెంబర్ 12, 2025
రేటింగ్: ⭐⭐⭐/5
కథ:
మీడియా దిగ్గజం జయదేవ్ రెడ్డి (ఆది పినిశెట్టి) ఒక జాతీయవాద (Movie review) గ్రూప్‌తో రహస్య ఒప్పందంలోకి వెళ్లి, కుటుంబంతో కలిసి లండన్ వెళ్లేందుకు ప్లాన్ చేస్తాడు. ఇదే సమయంలో ఒక హ్యాకర్ ఆ ఒప్పందాన్ని బయటపెట్టి, జయదేవ్ జీవితాన్ని కుదిపేస్తాడు. ఆ తర్వాత అతని కుటుంబం, సన్నిహితులపై సీరియల్ టార్గెటింగ్ కొనసాగుతుంది. ఈ హ్యాకర్ ఎవరు? జయదేవ్‌ను ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు? చివరికి ఈ పోరు ఎలా ముగుస్తుంది? అనేదే కథ.
పాజిటివ్ పాయింట్స్:
ఆది పినిశెట్టి మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చినా, సినిమా మొత్తాన్ని లిఫ్ట్ చేయలేకపోయాడు. హ్యాకర్‌తో కొన్ని సన్నివేశాలు బాగానే పనిచేస్తాయి. క్లైమాక్స్‌లో సత్యదేవ్ ఎంట్రీ సినిమాకు కొత్త ఆరంభం సూచించేలా ఉంటుంది. కెమెరా వర్క్, లొకేషన్ సెలెక్షన్ విజువల్‌గా ఆకట్టుకుంటాయి.
Read also: Actress Vahini: క్యాన్సర్ తో బాధపడుతున్న నటి వాహిని
నెగెటివ్ పాయింట్స్:
రివెంజ్ డ్రామాAttempt చేసినా, అసలు టెన్షన్, థ్రిల్ రాకపోవడం పెద్ద మైనస్. హ్యాకర్ మోటివ్‌లో డెప్త్ లేకపోవడం అతని సామర్థ్యం చూస్తే కథ చాలా (Movie review) ఈజీగా ముగియాలి, కానీ స్క్రిప్ట్ ఆ అవకాసాన్ని అసలు వదలదు. మడోన్నా సెబాస్టియన్ పాత్ర మొత్తం సినిమా మీద ఎలాంటి ప్రభావం చూపదు. ఎమోషన్, లాజిక్ రెండు కూడా మిస్సయ్యాయి. చాలా సీన్లు కామెడీలా అనిపించి, సీరియస్ Momentum పూర్తిగా తగ్గిపోయింది.
టెక్నికల్ డిపార్ట్‌మెంట్:
దర్శకుడు జెన్యూస్ మహ్మద్ కథలో పేస్, పంచ్, ఎమోషన్ (Movie review) ఈ మూడు కూడా మిస్సయ్యాయి. అబినంధన్ రామానుజంన్ సినిమాటోగ్రఫీ ఒక్కటే సినిమా బలంగా నిలబెట్టిన అంశం. ఒషో వెంకట్ మ్యూజిక్ సీన్లతో సింక్ కాలేదు. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ ఫస్ట్ హాఫ్ ఓకే అయినా, సెకండ్ హాఫ్ మాత్రం బోర్ అయ్యేలా సాగింది.
వెర్డిక్ట్:
డ్రైవ్ ఒక బోరింగ్ రివెంజ్ డ్రామా. ఆది పినిశెట్టి నటన ఉన్నా కథ, టేకింగ్ బలహీనతలతో సినిమా అస్సలు ఎఫెక్ట్ చేయదు. స్ట్రాంగ్ రైటింగ్, పేసింగ్ ఉంటే మంచి థ్రిల్లర్ అయ్యేది… కానీ అలా కాలేదు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read also: