ఇటీవల సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో కనిపించే సంఘటన నిజంగా గుండెలు కలచివేస్తోంది. సాధారణంగా మన ఇళ్ల దగ్గర తిరిగే వీధి కుక్క (Street Dogs) లు కొన్నిసార్లు మృగాల్లా ప్రవర్తిస్తాయనే విషయాన్ని ఈ ఘటన మళ్లీ నిరూపించింది. ప్రశాంతంగా, ఎటువంటి ఆందోళనలూ లేకుండా ఉన్న ఒక ఇంట్లోకి మూడు నుండి నాలుగు వీధి కుక్కలు ప్రవేశించి అక్కడ ఆడుకుంటున్న చిన్నారిపై దాడి చేయడం వీడియోలో స్పష్టంగా రికార్డైంది.ఆ చిన్నారి ఎటువంటి రక్షణ లేకుండా ఒక్కసారిగా దాడి ఎదుర్కొనడం హృదయాన్ని కదిలించే విషయం. కుక్కలు గుంపులుగా దాడి చేస్తూ, ఆ చిన్నారిని గీకి, కొరుకుతూ మరింత భయంకరంగా ప్రవర్తించాయి. చిన్నారి తప్పించుకోవడానికి చేసిన ప్రతి ప్రయత్నం వృథా కావడం ఆ దృశ్యాన్ని చూసే ప్రతి ఒక్కరి మనసును కలచివేస్తోంది. చిన్నారిపై కుక్కలు దాడి (Dogs attack child) చేస్తున్న సమయంలో అక్కడ పెద్దవారు లేకపోవడం పరిస్థితిని మరింత విషమంగా మార్చింది. వీడియోలో ఆ చిన్నారి కేకలు, భయంతో వణికిపోతూ చేసిన పోరాటం అందరినీ కన్నీళ్లకు గురి చేస్తోంది.
ఎందుకంటే వీధి కుక్కల సమస్య కొత్తది కాదు
అప్పుడు అకస్మాత్తుగా, ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి గోడ పై నుంచి కుక్కలల తెరగొట్టే ప్రయత్నం చేస్తాడు. అంతలోనే ఓ మహిళ రావడంలో ఈ కుక్కలు అక్కడిని నుంచి పరారయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు కుక్కలపై తీవ్ర స్థాయిలో మండిపడిపోతున్నారు. ఈ వీడియోను @KarishmaAziz_ అనే ఖాతా నుండి షేర్ చేయగా, ఇప్పటివరకు లక్షలాది మంది వీక్షించారు.ఈ ఘటనతో ప్రజల్లో పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతోంది. ఎందుకంటే వీధి కుక్కల సమస్య కొత్తది కాదు. దేశంలోని చాలా పట్టణాలు, నగరాలు, గ్రామాల్లో వీధి కుక్కలు ఎక్కడపడితే అక్కడ తిరుగుతుంటాయి. పగలే కాకుండా రాత్రి సమయంలో మరింత విరుచుకుపడతాయి. చాలాసార్లు పాఠశాలకు వెళ్తున్న పిల్లలు, ఉదయం నడకకు బయలుదేరిన వృద్ధులు, ఇంటి పనుల కోసం బయటికి వచ్చే మహిళలు వీటి దాడులకు గురవుతున్నారు. ఈ సంఘటనలతో కలిగే గాయాలు శారీరకంగా మాత్రమే కాదు, మానసికంగా కూడా భయాన్ని నింపేస్తాయి.
Read hindi news: hindi.vaartha.com
Read also: