కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో అధికార మార్పిడి వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. రాష్ట్రంలో ముఖ్యమంత్రి (Karnataka CM) మార్పు అంశంపై ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (DK Shivakumar) మరోసారి స్పందించారు. ఈ మేరకు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆశ లేకపోతే.. జీవితమే లేదని, కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుందంటూ డీకే శివకుమార్ (DK Shivakumar) పేర్కొన్నారు.

ప్రముఖ జాతీయ మీడియా ఇండియా టుడే కాంక్లేవ్ సౌత్ 2025 సదస్సులో డీకే శివకుమార్ (DK Shivakumar) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘కాంగ్రెస్ ప్రభుత్వంలోని రెండో సగభాగం ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారా..?’ అన్న ప్రశ్న ఆయనకు ఎదురైంది. దీనికి డీకే స్పందిస్తూ.. ‘నేను దీనికి సమాధానం చెప్పలేను. కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది. ఈ ప్రపంచంలో ఎవరైనా సరే ఆశతో జీవించాలి. ఆశ లేకపోతే.. జీవితమే లేదు’ అంటూ చెప్పుకొచ్చారు. సీఎం మార్పు నిర్ణయం పూర్తిగా కాంగ్రెస్ హైకమాండ్‌దేనని తెలిపారు. హైకమాండ్ నిర్ణయం, ఆదేశాల ప్రకారం ముందుకెళ్తామని చెప్పారు. హైకమాండ్ ఏం నిర్ణయిస్తే.. దాన్ని అంగీకరిస్తామని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
కర్ణాటకలో డీకే ఎవరు?
శివకుమార్. దొడ్డలహళ్లి కెంపెగౌడ శివకుమార్ (జననం 15 మే 1962) ఒక భారతీయ రాజకీయవేత్త మరియు వ్యాపారవేత్త, అతను కర్ణాటక 9వ మరియు ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి.
కర్ణాటకలో అత్యంత ధనవంతుడు ఎవరు?
ఫోర్బ్స్ భారతదేశంలోని 100 మంది ధనవంతుల జాబితాలో, కేవలం ఎనిమిది మంది మాత్రమే కర్ణాటకకు చెందినవారు, కానీ వారి ప్రభావం చాలా పెద్దది. విప్రో ద్వారా కర్ణాటకను ప్రపంచ ఐటీ పటంలో ఉంచిన అజీమ్ ప్రేమ్‌జీ నుండి, భారతీయులు జెరోధాతో స్టాక్‌ల వ్యాపారం చేసే విధానాన్ని మార్చిన నిఖిల్ కామత్ వరకు, ఈ పేర్లు వారి దృష్టి మరియు విజయానికి ప్రత్యేకంగా నిలుస్తాయి.
డి. కె. శివకుమార్ నేపథ్యం ఏమిటి?
కర్ణాటకలోని బెంగళూరు సమీపంలోని కనకపురలో కెంపెగౌడ మరియు గౌరమ్మ దంపతులకు శివకుమార్ జన్మించాడు. అతను వొక్కలిగ సమాజానికి చెందినవాడు. అతనికి ఒక తమ్ముడు డి. కె. సురేష్ ఉన్నాడు, అతను కూడా రాజకీయ నాయకుడే.
Read hindi news: hindi.vaartha.com
Read Also: