DK Shivakumar : కర్ణాటక రాజకీయాల్లో సీఎం మార్పు అంశంపై వస్తున్న ఊహాగానాలకు డిప్యూటీ సీఎం D. K. Shivakumar స్పందించారు. కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి అసమ్మతి లేదని స్పష్టం చేస్తూ, ముఖ్యమంత్రి Siddaramaiahతో తన సంబంధం “పాలు-తేనె లాంటి బంధం” అని వ్యాఖ్యానించారు.
బెంగళూరులో మీడియాతో మాట్లాడిన ఆయన, సీఎం మార్పుపై ఇప్పటివరకు ఎలాంటి చర్చ జరగలేదని తెలిపారు. విపక్షాలు రాజకీయ లాభాల కోసం పార్టీ లోపల విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. “మా ఇద్దరి మధ్య పూర్తి అవగాహన ఉంది. అన్నింటికీ సమయం సమాధానం చెబుతుంది” అని డీకే పేర్కొన్నారు.
Read also: Missile Attack on AliKhamenei: ఖమేనీ కుమార్తె, అల్లుడు మృతి? 40 మంది కమాండర్లు ఖతం

ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై సీఎం సిద్ధరామయ్య ఇచ్చిన వివరణను ఆయన సమర్థించారు. కేంద్ర మంత్రి H. D. Kumaraswamy, ప్రతిపక్ష నేత R. Ashoka చేసిన ఆరోపణలు నిరాధారమని పేర్కొన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్‌లో చీలికలు తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు.
అలాగే, కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (KPCC) అధ్యక్షుడిగా తన ఆరేళ్ల పదవీకాలం పూర్తవుతున్న సందర్భంగా మార్చి 10న ప్రత్యేక విందు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కొత్త నాయకత్వానికి అవకాశం ఇవ్వాలని తాను భావిస్తున్నానని కూడా వెల్లడించారు.
hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: