కర్ణాటక కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి పదవి వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. సీఎం సిద్ధరామయ్య కుమారుడు, ఎమ్మెల్సీ యతీంద్ర చేసిన వ్యాఖ్యలు, వాటిపై ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (DK Shivakumar) స్పందించిన తీరు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Read Also: Goa nightclub fire : గోవా క్లబ్ అగ్నిప్రమాదం: ముందే ఫిర్యాదులు, అయినా చర్యలేవు?
యతీంద్ర కీలక వ్యాఖ్యలు
ముఖ్యమంత్రి మార్పు ఉండదని, సిద్ధరామయ్య పూర్తికాలం పదవిలోనే కొనసాగుతారని యతీంద్ర సోమవారం తెలిపారు. డీకే శివకుమార్ డిమాండ్‌ను అధిష్ఠానం తోసిపుచ్చిందని కూడా వ్యాఖ్యానించారు.

డీకే శివకుమార్ ప్రతిస్పందన
ఈ వ్యాఖ్యలపై మీడియా ప్రశ్నించగా, డీకే “చాలా సంతోషం… రాష్ట్రానికి మంచే జరగాలి” అని సంక్షిప్తంగా సమాధానమిచ్చారు, వివాదాన్ని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.
మద్దతుదారుల నినాదాలు
బెళగావి శీతాకాల సమావేశాల కోసం ప్రయాణించిన డీకే శివకుమార్‌కు మద్దతుదారులు “డీకే నెక్ట్స్ సీఎమ్” అంటూ నినాదాలు చేస్తూ ఉత్సాహం ప్రదర్శించారు. మరోవైపు ఆయన సన్నిహితురాలు వల్ల మంత్రి లక్ష్మీ హెబ్బాల్కర్ సోదరుడు, ఎమ్మెల్సీ చన్నరాజ్ హట్టిహోళి సోషల్ మీడియాలో డీకే శివకుమార్‌ను “ముఖ్యమంత్రి”గా సంబోధించడం కలకలం రేపింది.
పార్టీ నేతల ప్రతిస్పందనలు
యతీంద్ర వ్యాఖ్యలు అనవసరమని చన్నరాజ్ పేర్కొన్నారు. సీఎం పదవిపై పార్టీ అధిష్ఠానం సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి మాట్లాడుతూ, పార్టీలో ఎలాంటి విభేధాలు లేవని, అధిష్ఠానం నిర్ణయమే తుది అని స్పష్టం చేశారు. నేతలు బహిరంగ వ్యాఖ్యలు చేసేటప్పుడు బాధ్యతగా ఉండాలని సూచించారు.
అంతర్గత విభేదాలు మళ్లీ బహిర్గతం
నేతలు వివాదాన్ని చల్లార్చే ప్రయత్నం చేస్తున్నప్పటికీ, మద్దతుదారుల నినాదాలు, సోషల్ మీడియా పోస్టులు మరోసారి కర్ణాటక కాంగ్రెస్‌లో అంతర్గత పోరును బహిర్గతం చేశాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: