బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం, దిత్వా తుఫాను (Dithwa Cyclone) గా మారి వేగంగా తీరాల వైపు కదులుతోంది. దీని ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాలు ఇప్పటికే అతలాకుతలమవుతున్నాయి. తీరం దాటకముందే తుపాను (Dithwa Cyclone) తన ప్రతాపాన్ని చూపిస్తుండటంతో, అధికారులు అప్రమత్తమై ముందుజాగ్రత్త చర్యలు చేపట్టారు. చెన్నై సహా పలు ప్రభావిత జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించగా, అనేక విమాన సర్వీసులను రద్దు చేశారు.
Read Also: Maoist Surrender:అనంత్ సహా 12 మంది లొంగుబాటు

విద్యా సంస్థలకు సెలవులు
భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించిన తాజా సమాచారం ప్రకారం ‘దిత్వా’ తుపాను వాయవ్య దిశగా గంటకు 7 కిలోమీటర్ల వేగంతో కదులుతూ, ఉత్తర తమిళనాడు-పుదుచ్చేరి తీరానికి సమీపంలో కేంద్రీకృతమై ఉంది. ఇది రేపు ఉదయానికి తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
దీని కారణంగా తమిళనాడులోని కడలూరు, విల్లుపురం, చెంగల్పట్టు జిల్లాలతో పాటు పుదుచ్చేరికి రెడ్ అలర్ట్ జారీ చేశారు. సముద్రం అల్లకల్లోలంగా మారడంతో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: