కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్(Digvijaya Singh) కీలక నిర్ణయం తీసుకున్నారు. మూడోసారి రాజ్యసభకు పోటీ చేయడం లేదని చెప్పారు. ఏప్రిల్ 2026లో ఆయన పదవీకాలం ముగియనున్నది. అయితే మధ్యప్రదేశ్‌కు చెందిన కాంగ్రెస్ పార్టీ ఎస్సీ శాఖ అధ్యక్షుడు ప్రదీప్ అహిర్‌వార్ నుంచి అభ్యర్థన రావడం వల్ల దిగ్విజయ్ (Digvijaya Singh)తన రాజ్యసభ సీటును త్యాగం చేయబోనున్నట్లు తెలుస్తున్నది.
Read Also : UIDAI: మీ ఆధార్ కార్డు సేఫ్‌గా ఉందో లేదో ఇలా తెలుసుకొండి

షెడ్యూల్ కులాలకు చెందిన నేతను ఎగువ సభకు పంపాలని భావిస్తున్నట్లు ప్రదీప్ తెలిపారు. జనవరి 13వ తేదీన ప్రదీన్ ఓ లేఖ రాశారు. సామాజిక న్యాయం కోసం మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు కాంగ్రెస్ సీటుపై ఓ దళితుడిని పంపాలని భావిస్తున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. మధ్యప్రదేశ్‌లో ఎస్సీలు 17 శాతం ఉన్నట్లు తెలిపారు.రాజ్యసభను వదిలేది నా చేతుల్లో లేదని, కానీ తన రాజ్యసభ సీటును ఖాళీ చేస్తున్నానని దిగ్విజయ్ ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. 2014 నుంచి ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. మధ్యప్రదేశ్ సీఎంగా యాన రెండు సార్లు బాధ్యతలు నిర్వర్తించారు. 1993 నుంచి 2003 వరకు ఆయన సీఎంగా చేశారు. 2003లో ఓడి పోయిన తర్వాత రాజకీయాలకు దిగ్విజయ్ స్వస్తి పలికారు. పదేళ్ల తర్వాత ఆయన రాజ్యసభలోకి ఎంట్రీ ఇచ్చారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: