ఆరు దశాబ్దాలుగా సినీ పరిశ్రమలో (film industry) నటిస్తూ కోట్లాది మంది హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న నటుడు ధర్మేంద్ర 89 ఏళ్ల వయస్సు లోనూ తన సినిమాల పట్ల ఉన్న ప్రేమను తగ్గించుకోలేదు.డిసెంబరు 8న 90వ ఏట అడుగుపెట్టబోతున్న సమయంలోనే ఇలాంటి విషాదం చోటుచేసుకోవడం అభిమానులు మరింత విచారంలో మునిగిపోయారు.
Read Also: AP: ‘ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్’పై అధికారులతో చంద్రబాబు సమీక్ష

ధర్మేంద్ర (Dharmendra) కీలక పాత్ర పోషించిన ‘ఇస్కీస్’ సినిమా డిసెంబరు 25న విడుదలకు సిద్ధంగా ఉంది. పరమవీర చక్ర గ్రహిత అరుణ్ ఖేతర్ పాల్ బయోపిక్ గా రూపొందుతున్న ఈ సినిమాలో ధర్మేంద్ర, ఖేతర్ పాల్ తండ్రి పాత్రను పోషించారు. ఆయన చివరగా నటించిన ఈ సినిమా ఇప్పుడు భావోద్వేగాలకు కేంద్రబిందువైంది.
సూప్ హిట్ కొట్టిన సినిమాలు
ధర్మేంద్ర బాలీవుడ్ లో ‘హీ మాన్ ఆఫ్ ఇండియన్ సినిమా’గా, మాస్ హీరోగా, చాక్లెట్ బాయ్గా, యాక్షన్ స్టార్గా అనేక రూపాల్లో ప్రేక్షకులకు చేరువయ్యారు. ‘షోలే’, సత్యకామ్, చుప్ చప్ కే, సీతా ఔర్ గీతా, యాదోన్ కీ బారత్, రజియా సుల్తాన్, ధర్మ్ వీర్ వంటి చిత్రాలతో ఆయన నటనకు దేశవ్యాప్తంగా ప్రత్యేక గౌరవం దక్కింది. భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత నిలకడైన కెరీర్ సాగించిన నటుల్లో ఆయన ముందు వరుసలో ఉంటారు. 1960లో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ధర్మేంద్ర 2025 వరకు సినిమాలో చురుకుగా కొనసాగడం అరుదైన ఘనతగా చెప్పుకోవాలి.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: