Dharmasthala : ధర్మస్థలలో గత ఇరవై ఏళ్లుగా జరిగిన హత్యలు, అత్యాచారాలు, మృతదేహాల పాతిపెట్టడం వంటి ఆరోపణలు చేసిన విజిల్‌బ్లోవర్‌ను ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) అరెస్ట్ చేసింది. ఈ కేసుపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పందిస్తూ, (Dharmasthala) ప్రభుత్వం ఎవరిపక్షంలోనూ లేనని, న్యాయం జరిగేలా చూస్తామని స్పష్టం చేశారు.
డీకే శివకుమార్ మాట్లాడుతూ, “మేము ఎవరి పక్షంలోనూ లేం. మాకు ఒక్కటే ముఖ్యం – న్యాయం. ధర్మంపై రాజకీయాలు చేయకండి. SIT విచారణ కొనసాగుతోంది. ఎవరు దోషులైనా కఠిన చర్యలు తప్పవు” అని అన్నారు.
అదే సమయంలో, ధర్మస్థల దేవస్థానం కుటుంబం కూడా SIT ఏర్పాటు చేసినందుకు మద్దతు తెలిపిందని ఆయన పేర్కొన్నారు.
గృహశాఖ మంత్రి స్పందన
కర్ణాటక గృహశాఖ మంత్రి జి.పరమేశ్వర విజిల్‌బ్లోవర్ అరెస్టును ధృవీకరించారు. అయితే, “SIT దర్యాప్తు పూర్తయ్యే వరకు ఎటువంటి నిర్ణయానికి రావడం సరికాదు. నిజాలు వెలుగులోకి వస్తాయి” అని తెలిపారు.
విజిల్‌బ్లోవర్ కోర్టు ముందు హాజరు పరచబడ్డాడు. విచారణలో, అతను తప్పుడు సమాచారం ఇచ్చినట్టు ఒప్పుకున్న తర్వాత SIT కస్టడీకి తీసుకుంది. ధర్మస్థలలో 18 ప్రదేశాలు తవ్వగా, రెండు చోట్ల అవశేషాలు లభించాయి. ఇవి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు.
Read also :