త్రిపుర రాష్ట్రంలోని ధలాయ్ జిల్లాలో బుధవారం చోటుచేసుకున్న ఘోర ప్రమాదం రాష్ట్రవ్యాప్తంగా విషాదాన్ని నింపింది. స్థానికంగా పనిచేస్తున్న ఇటుకల బట్టీలో ఉన్న భారీ చిమ్నీ అకస్మాత్తుగా కూలిపోవడంతో అక్కడ పని చేస్తున్న నలుగురు కార్మికులు మృతి చెందారు. అదే ఘటనలో మరో నలుగురు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పనులు సాగుతున్న సమయంలో ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండానే చిమ్నీ కూలినట్టు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది.
Read also: Oman: భారత్-ఒమన్ మధ్య వాణిజ్య ఒప్పందం

Dhalai District
ఈ ఘటనపై ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. పూర్తి స్థాయి విచారణ చేపడుతున్నామని అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి మాణిక్ సాహా మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తూ, ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా భద్రతా ప్రమాణాలను కఠినంగా అమలు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: