ఎయిర్‌బస్ A320 విమానాల్లో గుర్తించిన సాఫ్ట్‌వేర్ (software) సమస్య భారత విమానయాన రంగానికీ తాకింది. ఈ లోపం కారణంగా దేశంలో మొత్తం 338 విమానాలు ప్రభావితమయ్యాయని డీజీసీఏ స్పష్టం చేసింది. వీటిలో 270 విమానాలకు ఇప్పటికే అప్‌డేట్ పూర్తి చేశారని అధికారులు తెలిపారు.

DGCA: Software issue has arisen in Airbus A320 aircraft
ప్రపంచవ్యాప్తంగా దాదాపు 6,000 విమానాలకు
యూరోపియన్ ఏవియేషన్ సేఫ్టీ ఏజెన్సీ ఆదేశాలతో ప్రపంచవ్యాప్తంగా A320 విమానాలకు సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్ తప్పనిసరైంది. విమాన నియంత్రణ వ్యవస్థలోని ELAC యూనిట్‌లో వచ్చిన లోపమే ఈ నిర్ణయానికి కారణమైంది. దాంతో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 6,000 విమానాలకు అప్‌డేట్ ప్రక్రియ కొనసాగుతోంది.
భారతదేశంలో ఇండిగో, ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సర్వీసులు ఈ సమస్యతో ప్రభావితమయ్యాయి. కొన్ని సర్వీసుల్లో ఆలస్యాలు చోటుచేసుకున్నప్పటికీ, రద్దులు లేవని అధికారులు తెలిపారు. పరిస్థితిని సమీక్షిస్తూ ప్రయాణికులకు అసౌకర్యం లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు డీజీసీఏ పేర్కొంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: