हिन्दी | Epaper

Delhi weather : ఢిల్లీకి వర్షాల ఉపశమనం.. ఏడేళ్ల రికార్డు వేడి బ్రేక్

Sai Kiran
Delhi weather : ఢిల్లీకి వర్షాల ఉపశమనం.. ఏడేళ్ల రికార్డు వేడి బ్రేక్

Delhi weather : ఏడేళ్ల రికార్డు స్థాయి వేడికి ఢిల్లీలో బ్రేక్ పడింది. శుక్రవారం ఉదయం ఢిల్లీ–ఎన్‌సీఆర్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురవడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. నోయిడా, ఘజియాబాద్ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. ఉత్తర భారతదేశంపై ప్రభావం చూపుతున్న పశ్చిమ కల్లోలం కారణంగానే ఈ మార్పులు చోటుచేసుకున్నాయని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఢిల్లీకి ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

గురువారం ఢిల్లీలో గరిష్ఠ ఉష్ణోగ్రత 27.1 డిగ్రీల సెల్సియస్‌కు చేరి గత ఏడేళ్లలోనే అత్యధికంగా నమోదైంది. అయితే తాజా వర్షాల ప్రభావంతో శుక్రవారం ఉష్ణోగ్రతలు 18–20 డిగ్రీలకు పడిపోతాయని, శనివారం నాటికి 16–18 డిగ్రీల వరకు తగ్గే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశమూ ఉందని తెలిపింది.

Read Also: Udayanidhi Stalin: ఉదయనిధి వ్యాఖ్యలు హద్దులు దాటాయా? హైకోర్టు కీలక వ్యాఖ్యలు

వర్షాల కారణంగా ఢిల్లీలో గాలి నాణ్యత మెరుగుపడనుంది. (Delhi weather) ఇప్పటివరకు ‘వెరీ పూర్’ కేటగిరీలో ఉన్న AQI క్రమంగా తగ్గే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. వర్షానికి ముందు నోయిడాలో AQI 329గా, ఘజియాబాద్‌లో 347గా నమోదైంది. ఈ వాతావరణ ప్రభావం శనివారం ఉదయం వరకు కొనసాగవచ్చని, జనవరి 26 నుంచి మరో పశ్చిమ కల్లోలం ఉత్తర భారతాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

తపాలా శాఖ GDS ఫలితాలు విడుదల

తపాలా శాఖ GDS ఫలితాలు విడుదల

ఉపాధి హామీ పథకానికి సాంకేతిక ఆటంకాలు

ఉపాధి హామీ పథకానికి సాంకేతిక ఆటంకాలు

ప్రపంచంలో అత్యంత బలహీనమైన పాస్‌వర్డులు ఇవే

ప్రపంచంలో అత్యంత బలహీనమైన పాస్‌వర్డులు ఇవే

ప్రపంచ కుబేరుల జాబితాలో భారత్ మూడో స్థానం

ప్రపంచ కుబేరుల జాబితాలో భారత్ మూడో స్థానం

భారత ఫుట్‌బాల్ దిగ్గజం సయ్యద్ హమీద్ కన్నుమూత

భారత ఫుట్‌బాల్ దిగ్గజం సయ్యద్ హమీద్ కన్నుమూత

ఫ్లిప్ కార్ట్ లో ఉద్యోగాల కోత 300 మందికి లేఆఫ్

ఫ్లిప్ కార్ట్ లో ఉద్యోగాల కోత 300 మందికి లేఆఫ్

మార్చి 7 బంగారం ధరలు నగరాల వారీగా తాజా రేట్లు

మార్చి 7 బంగారం ధరలు నగరాల వారీగా తాజా రేట్లు

సామాన్య ప్రజలపై సిలిండర్ భారం..భారీగా పెరిగిన ధరలు

సామాన్య ప్రజలపై సిలిండర్ భారం..భారీగా పెరిగిన ధరలు

బెన్ అఫ్లెక్ స్టార్టప్‌ను సొంతం చేసుకున్న నెట్‌ఫ్లిక్స్!

బెన్ అఫ్లెక్ స్టార్టప్‌ను సొంతం చేసుకున్న నెట్‌ఫ్లిక్స్!

వందే భారత్ ప్రయాణికులకు అలర్ట్: రైలు సమయాల్లో మార్పు

వందే భారత్ ప్రయాణికులకు అలర్ట్: రైలు సమయాల్లో మార్పు

కేంద్రం సంచలన నిర్ణయం: వార్తా ఛానళ్ల టీఆర్‌పీ రేటింగ్‌లు నిలిపివేత!

కేంద్రం సంచలన నిర్ణయం: వార్తా ఛానళ్ల టీఆర్‌పీ రేటింగ్‌లు నిలిపివేత!

ఐదు వేలకే టీవీ సమ్మర్ తగ్గింపులతో భారీ ఆఫర్

ఐదు వేలకే టీవీ సమ్మర్ తగ్గింపులతో భారీ ఆఫర్

📢 For Advertisement Booking: 98481 12870