ఆశ్రమం పేరుతో డజనుకు పైగా యువతులను లైంగికంగా వేధించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న చైతన్యానంద(Chaithanyananda) సరస్వతి అలియాస్ పార్థసారథి బాగోతం ఒక్కొక్కటిగా బయటపడుతోంది. సుమారు 50 రోజులుగా పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న అతడిని రెండు రోజుల క్రితం ఆగ్రాలోని ఒక హోటల్‌లో అరెస్ట్ చేయగా, దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో అతడికి సహకరించిన ఇద్దరు మహిళా అనుచరులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Read Also: Trump: ట్రంప్ షాక్: అమెరికాలో లక్ష మంది ఉద్యోగులు ఔట్!
మొబైల్‌లో లోబరుచుకునే ప్రయత్నాలు
చైతన్యానంద మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు అందులో ఉన్న సమాచారాన్ని చూసి నివ్వెరపోయారు. పలువురు యువతులకు రకరకాల ఆశలు చూపి లోబరుచుకునేందుకు ప్రయత్నించినట్టు వాట్సాప్ చాట్స్ ద్వారా గుర్తించారు. అంతేకాకుండా, పలువురు మహిళా క్యాబిన్ క్రూ సభ్యులతో దిగిన ఫొటోలు, ఎందరో అమ్మాయిల సోషల్ మీడియా ప్రొఫైల్ చిత్రాలను స్క్రీన్‌షాట్లు తీసుకుని తన ఫోన్‌లో సేవ్ చేసుకున్నట్టు పోలీసులు కనుగొన్నారు. యువతులతో అసభ్యంగా మాట్లాడటం, అసభ్యకర మెసేజ్‌లు పంపడం, బలవంతంగా తాకడం వంటివి చేసేవాడని బాధితులు ఫిర్యాదు చేశారు. మహిళల హాస్టల్‌లో రహస్యంగా కెమెరాలు కూడా అమర్చినట్టు ఆరోపణలు ఉన్నాయి.

మోసాలు, బెదిరింపులు
లైంగిక వేధింపులే కాకుండా, చైతన్యానంద పలు మోసాలకు కూడా పాల్పడినట్టు తేలింది. తాను ఐక్యరాజ్యసమితి (యూఎన్),(UN) బ్రిక్స్ దేశాలకు రాయబారినంటూ నకిలీ విజిటింగ్ కార్డులు సృష్టించుకుని తిరిగేవాడని పోలీసులు తెలిపారు. ఇతడిపై చర్యలు తీసుకోవాలని బాధితుల్లో ఒకరి తండ్రి ప్రయత్నించగా, స్వామి అనుచరుడైన హరి సింగ్ కోప్కోటి అనే వ్యక్తి బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో పోలీసులు అతడిని కూడా అరెస్ట్ చేశారు. వసంత్ కుంజ్‌లోని శ్రీ శారదా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మేనేజ్‌మెంట్‌కు గతంలో డైరెక్టర్‌గా పనిచేసిన చైతన్యానందను, 17 మంది విద్యార్థినులు తమను వేధించారని వాంగ్మూలం ఇవ్వడంతో ఇనిస్టిట్యూట్ యాజమాన్యం విధుల నుంచి తొలగించింది.
విచారణకు సహకరించని నిందితుడు
పోలీసుల విచారణకు ఈ దొంగ బాబా ఏమాత్రం సహకరించడం లేదని, అడిగిన ప్రశ్నలకు అబద్ధాలు చెబుతూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడని అధికారులు తెలిపారు. తిరుగులేని ఆధారాలు చూపించినప్పుడు మాత్రమే నోరు విప్పుతున్నాడని, తన చర్యల పట్ల అతడిలో ఎలాంటి పశ్చాత్తాపం కనిపించడం లేదని వెల్లడించారు.
చైతన్యానందను పోలీసులు ఎక్కడ అరెస్ట్ చేశారు?
సుమారు 50 రోజులు గాలించిన తర్వాత ఆగ్రాలోని ఓ హోటల్‌లో అరెస్ట్ చేశారు.
ఆయనపై ఉన్న ప్రధాన ఆరోపణలు ఏమిటి?
లైంగిక వేధింపులు, యువతులను లోబరుచుకునే ప్రయత్నాలు, మదర్సాలో రహస్య కెమెరాల ఏర్పాటు, నకిలీ విజిటింగ్ కార్డుల ద్వారా మోసాలు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: