Delhi red alert : దట్టమైన పొగమంచు కారణంగా దేశ రాజధాని ఢిల్లీలో పరిస్థితి తీవ్రంగా మారింది. వాతావరణ శాఖ (IMD) ఢిల్లీలో ఆరెంజ్ అలర్ట్‌ను రెడ్ అలర్ట్‌గా అప్గ్రేడ్ చేస్తూ మంగళవారం వరకూ హెచ్చరికలు జారీ చేసింది. ఈ ప్రభావంతో ఇప్పటివరకు 128 విమానాలు రద్దయ్యాయి.
ఢిల్లీతో పాటు పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఉత్తరప్రదేశ్‌తో పాటు ఉత్తర, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలకు కూడా అలర్ట్ జారీ చేసినట్లు ఐఎండీ తెలిపింది.
“డిసెంబర్ 30 ఉదయం వరకూ దట్టమైన నుంచి అత్యంత దట్టమైన పొగమంచు కమ్ముకునే అవకాశం ఉంది. విజిబిలిటీ బాగా తగ్గుతుంది. ప్రజలు అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దు” అని ఐఎండీ హెచ్చరించింది.
Read also: EC: తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు ఈసీ కసరత్తు
ఇండిగో ట్రావెల్ అడ్వైజరీ
పొగమంచు ప్రభావంతో ఉత్తర భారతదేశంలోని పలు (Delhi red alert) విమానాశ్రయాల్లో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని ఇండిగో ఎయిర్‌లైన్స్ ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది.
రాత్రి, ఉదయం వేళల్లో పొగమంచు ఎక్కువగా ఉండటంతో ఫ్లైట్లు ఆలస్యం కావడం లేదా రద్దు అయ్యే అవకాశం ఉందని తెలిపింది.
ప్రయాణికులు తమ ఫ్లైట్ స్టేటస్‌ను ఎప్పటికప్పుడు అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవాలని, విమానాశ్రయానికి ముందుగానే చేరుకోవాలని ఇండిగో సూచించింది. రోడ్డు రవాణాపై కూడా పొగమంచు ప్రభావం ఉండవచ్చని హెచ్చరించింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: