हिन्दी | Epaper

Fire Accident: ఢిల్లీ కరోల్ బాగ్‌లోని షాపింగ్ మాల్ లో భారీ అగ్నిప్రమాదం

Sharanya
Fire Accident: ఢిల్లీ కరోల్ బాగ్‌లోని షాపింగ్ మాల్ లో భారీ అగ్నిప్రమాదం

దేశ రాజధాని ఢిల్లీ ప్రజలను భయబ్రాంతులకు గురిచేసిన ఈ ఘోర అగ్నిప్రమాదం (Fire Accident) రాత్రి చోటు చేసుకుంది. కరోల్ బాగ్ ప్రాంతంలో (Karol Bagh area) ఉన్న ప్రముఖ షాపింగ్ డెస్టినేషన్ “విశాల్ మెగా మార్ట్” భవనంలో ఈ అగ్నికీలక సంఘటన చోటుచేసుకుంది.

Fire Accident: ఢిల్లీ కరోల్ బాగ్‌లోని షాపింగ్ మాల్ లో భారీ అగ్నిప్రమాదం
Fire Accident: ఢిల్లీ కరోల్ బాగ్‌లోని షాపింగ్ మాల్ లో భారీ అగ్నిప్రమాదం

ఘటన ఎలా జరిగింది?

నిన్న సాయంత్రం 6:44 గంటల సమయంలో భవనంలోని మొదటి అంతస్తులో షార్ట్ సర్క్యూట్ (Short circuit) కారణంగా మంటలు చెలరేగాయి. (Fire Accident) మొదట మాల్ సిబ్బంది అక్కడున్న అగ్నిమాపక పరికరాలతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినప్పటికీ, అవి వేగంగా స్టోర్ మొత్తం వ్యాపించాయి. ఈ ప్రమాదంలో లక్షల రూపాయల విలువైన వస్తువులు, సరుకులు పూర్తిగా కాలి బూడిదయ్యాయి.

అగ్నిమాపక చర్యలు:

సమాచారం అందుకున్న వెంటనే ఢిల్లీ అగ్నిమాపక సిబ్బంది 13 ఫైరింజన్లతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఢిల్లీ పోలీసులు కూడా సహాయక చర్యల్లో పాలుపంచుకున్నారు. సుమారు రాత్రి 9 గంటల సమయానికి మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. ప్రమాదం జరిగినప్పటికీ, ఇంకా భవనంలో వేడి తగ్గకపోవడంతో కూలింగ్ ప్రక్రియ కొనసాగుతోందని, ఆరు ఫైరింజన్లు ఘటనా స్థలంలోనే ఉన్నాయని అధికారులు తెలిపారు.

పోలీసు విచారణ:

ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్‌కి కారణమైన భద్రతా లోపాలపై విచారణ కొనసాగుతోంది. మాల్ యాజమాన్యంపై నిర్లక్ష్యం కారణంగా కేసు నమోదు అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Read hindi news: hindi.vaartha.com

Read also: Pushkar Singh Dhami: సొంత పొలంలోనే దుక్కి దున్నిన ఉత్తరాఖండ్ సీఎం

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870