ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా(Rekha Gupta)ను చంపేస్తానని బెదిరింపులు(Threats) చేసిన 25 ఏళ్ల వ్యక్తిని ఢిల్లీలో అరెస్టు చేశారు. ఈ వ్యక్తి శ్లోక్ త్రిపాఠిగా గుర్తించబడినాడు.

ఢిల్లీ సీఎం(Delhi CM) రేఖా గుప్తాను చంపేస్తామంటూ ఇటీవల బెదిరింపులు వచ్చాయి. అయితే బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిని శనివారం అరెస్టు చేశారు. అతన్ని శ్లోక్ త్రిపాఠిగా గుర్తించారు. అతనో ఫ్రాడ్ అని తెలిసింది. తరుచూ అతను తన పేర్లను మారుస్తుంటాడని పోలీసులు వెల్లడించారు. ఢిల్లీ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. స్పెషల్ సెల్ పోలీసులు అతన్ని విచారిస్తున్నారు.
ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ నుంచి 112 ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డాడు. గురువారం రాత్రి నిందితుడు ఆ బెదిరింపు చేశాడు. ఢిల్లీ పోలీసులకు ఘజియాబాద్ పోలీసులు అలర్ట్ చేశారు. పంచవటి కాలనీకి పోలీసుల బృందాన్ని పంపించారు. అయితే అక్కడ నుంచి నిందితుడు తప్పించుకునే ప్రయత్నం చేసినట్లు ఘజియాబాద్ ఏసీపీ తెలిపారు.
ఫ్రాడ్‌స్టర్
శ్లోక్ త్రిపాఠి గతంలో కూడా ఫ్రాడ్‌స్టర్‌గా గుర్తించబడినాడు. అతను తనను ఐఏఎస్ అధికారి, పీఎంఓ అధికారిగా, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌గా పరిచయం చేసుకుని వ్యాపారస్తులు, రాజకీయ నాయకులను మోసగించాడు. అతని సహచరుడు రామ్‌శంకర్ గుప్తా (ఆశిష్ గుప్తా)తో కలిసి కోట్ల రూపాయలు మోసాలు చేశారు. రామ్‌శంకర్ గుప్తా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ యొక్క భద్రతా అధికారి, ప్రత్యేక కార్యదర్శి (నివేశం)గా తనను పరిచయం చేసుకుని ప్రజలను మోసగించాడు. ఈ ఇద్దరిని ఉత్తరప్రదేశ్ ప్రత్యేక టాస్క్ ఫోర్స్ (STF) అరెస్టు చేసింది.
Read Also:Rahul Gandhi: మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ కుట్ర చేసిందని రాహుల్ కీలక వ్యాఖ్యలు