పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తోంది. ఇందుకోసం ప్రభుత్వమే ఆ సంస్థలకు నిధులను సమకూరుస్తున్నది. హింస ద్వారా దేశాభివృద్ధి సాధించాలని ప్రయత్నించే పాక్ ఎప్పటికీ ఆ ఆశయం నెరవేరదు. మతపరమైన హింసలను ప్రేరేపించడంలో పాకిస్తాన్ కు మించిన దేశం మరొకటి ఉండదు. భారతదేశం ఆర్థిక మూలాలను దెబ్బతీయాలని, దేశ ప్రజలను హతమార్చేందుకు పాక్ చేయని ప్రయత్నం లేదు. ఇందుకోసం ఉగ్రవాదాన్ని పెంచిపోసిస్తోంది. ఇందుకు భారతదేశంలో ఉన్న ముస్లింలను టార్గెట్ గా చేసుకుని శిక్షణ ఇస్తున్నది. తాజాగా ఇద్దరు మైనర్ బాలురలను పోలీసులు అదుపులోకి తీసుకుంది. వీరు ఐసిస్ కు అండగా పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Read Also:Jadcherla: ఇద్దరు కార్మికులు సజీవ దహనం జడ్చర్లలో జిన్నింగ్ మిల్లు వద్ద ఘటన

సిరియాతో సంబంధాలు ఉన్న మైనర్లు
ఢిల్లీ బాంబు పేలుళ్లు (Delhi Blast) దేశాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేశాయి. అంతేకాక పేలుళ్లకు ఉగ్రవాద ముఠాలు చేసిన ప్రయత్నాలు, దాని వెనుక స్కెచ్ లు అందరినీ ఆశ్చర్యపోయేలా చేశారు. దీంతో భద్రతా బలగాలు ఫుల్ ప్రొటెక్షన్ లోకి వచ్చేశాయి. దేశవ్యాప్తంగా ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలను చేపట్టాయి. ఈ క్రమంలో నిన్న ముంబైలో ముగ్గురిని అరెస్టు చేశారు నేడు (బుధవారం) ఛత్తీస్ ఘడ్లో ఇద్దరు మైనర్ బాలురు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అదుపులోకి తీసుకుంది. వీరిద్దరికీ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియాతో సంబంధాలు
ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ బాలురు పాకిస్తాన్ (Pakistan) కేంద్రంగా పనిచేస్తున్న ఐసిస్ హ్యాండ్లర్ ఆధ్వర్యంలో పని చేస్తున్నారని. నకిలీ ఐడీల ద్వారా సోషల్ మీడియాలో ఉగ్రవాద, విద్వేష భావజాలం వ్యాప్తి చేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ తెలిపారు. అంతేకాదు ఈ ఇద్దరు కుర్రాళ్లు స్థానికంగా ఉన్న మరికొంతమంది బాలురను ఉగ్రవాదం వైపు ప్రభావితం చేసేందుకు యత్నిస్తున్నారని తెలిసింది.
మైనర్ల జీవితాలను పాడుచేస్తున్న ఉగ్రవాదులు
ఉగ్రవాదులతో సంబంధాలు కొనసాగిస్తున్న మైనర్లను (minors) గుర్తించడం ఇదే మొదటిసారని యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (Terrorist Squad) చెబుతోంది. ఇలాంటి వారు ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో మరింత దర్యాప్తు చేస్తున్నామని తెలిపింది. ముఖ్యంగా రాయపూర్, ఛత్తీస్ గఢ్ లోని ఇతర ప్రధాన నగరాల్లో గాలింపు చేపడుతున్నామన్నారు అధికారులు. పాకిస్తాన్ కు చెందిన ఐసిస్ మాడ్యూల్ భారత యువకులను లక్ష్యం చేసుకోవడానికి పలు నకిలీ సోషల్ మీడియా ఖాతాలను నడుపుతున్నట్లు దర్యాప్తులో తేలిందన్నారు.
ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కనిపించడంతో సోదాలు, అరెస్టులు కొనసాగుతున్నాయి. తాజాగా సోషల్ మీడియా, ఇతర డిజిటల్ మాధ్యమాల ద్వారా ఈ కేసుతో సంబంధం కలిగిన వ్యక్తులను కనిపెట్టడంపై కేంద్ర ఏజెన్సీలు దృష్టి సారించినట్టు ముంబై పోలీసు వర్గాలు తెలిపాయి. తాజాగా ముంబైలోని పలు ప్రాంతాల్లో ముగ్గురు అనుమానితులను కేంద్ర ఏజెన్సీలు అదుపులోకి తీసుకున్నాయి. ఈ ముగ్గురూ విద్యాధికులే కాకుండా ఉన్నత కుటుంబాల నుంచి వచ్చినట్టు తెలుస్తోంది. ముంబై పోలీసుల సాయం తీసుకుని దర్యాప్తు సంస్థలు ఈ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: