దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోట(Red Fort) మెట్రో స్టేషన్ సమీపంలో జరిగిన కారు బాంబు పేలుళ్లకు సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ దుర్ఘటన జరగడానికి కేవలం మూడు గంటల ముందు, ఒక విద్యార్థి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘రెడ్డిట్’లో పెట్టిన పోస్ట్ ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. పేలుడు జరిగిన ప్రదేశంలో భారీగా భద్రతా బలగాలను మోహరించడంపై అతను ఆ పోస్ట్‌లో అనుమానం వ్యక్తం చేశాడు.
Read Also: Red Fort Blast: ఆత్మాహుతి దాడేనా? బలమైన ఆధారాలు బయటకు!

పోస్ట్‌లో విద్యార్థి అనుమానం
12వ తరగతి చదువుతున్నట్లు చెప్పుకున్న ఆ విద్యార్థి, సాయంత్రం 4 గంటల సమయంలో ‘ఢిల్లీలో ఏదో జరగబోతోందా?’ అంటూ ఒక పోస్ట్ పెట్టాడు. “నేను ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చాను. ఎర్రకోట, మెట్రో స్టేషన్ల వద్ద ఎన్నడూ లేనంతగా పోలీసులు, ఆర్మీ సిబ్బంది, మీడియా కనిపిస్తున్నారు. మెట్రోలో ప్రయాణిస్తున్నప్పుడు కూడా నేను ఇంతమంది సైన్యాన్ని ఎప్పుడూ చూడలేదు. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది?” అని ఆ పోస్ట్‌లో ప్రశ్నించాడు.
పేలుడు తర్వాత వైరల్, ఉగ్రవాద కోణం
రాత్రి 7 గంటల ప్రాంతంలో అదే ప్రదేశంలో పేలుడు పదార్థాలతో నింపిన హ్యుందాయ్ ఐ20 కారు పేలిపోయిన తర్వాత, ఈ పోస్ట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. ఘటన జరగబోయే ప్రదేశం, సమయం విషయంలో ఇంత కచ్చితంగా అనుమానం వ్యక్తం చేయడంపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. “అతను మనల్ని తెలియకుండానే హెచ్చరించడానికి ప్రయత్నించాడు” అంటూ కామెంట్లు పెడుతున్నారు. సుభాష్ మార్గ్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద జరిగిన ఈ పేలుడు ఘటనపై ఉగ్రవాద కోణంలో విచారణ జరుగుతోంది. అదే రోజు ఫరీదాబాద్‌లో ఉగ్రవాద ముఠాకు చెందిన పలువురు అనుమానితులను అరెస్ట్ చేసిన నేపథ్యంలో దర్యాప్తు ముమ్మరం చేశారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah) ఈ ఘటనపై స్పందిస్తూ, అన్ని కోణాల్లో సమగ్ర దర్యాప్తు జరుపుతామని తెలిపారు. ఎన్ఐఏ, ఇంటెలిజెన్స్ బ్యూరో, ఢిల్లీ పోలీసుల యాంటీ-టెర్రర్ విభాగం సంయుక్తంగా ఈ కేసును విచారిస్తున్నాయని ఆయన ధృవీకరించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: