ఢిల్లీ ఎర్రకోట వద్ద చోటుచేసుకున్న కారు బాంబు పేలుడు కేసులో(Delhi Blast) జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) మరో ముఖ్యమైన ముందడుగు వేసింది. ఈ ఘటనలో కీలక పాత్ర పోషించిన కారు బాంబు తయారీదారుడు జసీర్ బిలాల్ వానిని అనంతనాగ్‌లో అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
Read Also: Cognizant: కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా!

కారు బాంబు తయారీలో ప్రధాన పాత్రధారి జసీర్ బిలాల్ అరెస్ట్
దర్యాప్తు ప్రకారం, ఆత్మాహుతి దాడికి పాల్పడిన ఉమర్‌కు ఉపయోగించిన కారు బాంబును(Delhi Blast) జసీర్ బిలాల్ అందించినట్లు తేలింది. అంతేకాక, డ్రోన్లు మరియు రాకెట్ల సాయంతో దాడులు జరపడానికి కూడా అతను కుట్ర పన్నినట్లు ఎన్‌ఐఏ విచారణలో బయటపడింది. ఇందుకు సంబంధించిన కేసులో ఇప్పటికే అమీర్ రషీద్ అలీని ఆదివారం అరెస్ట్ చేశారు. పేలుడు కోసం ఉపయోగించిన కారు అమీర్ పేరుతో రిజిస్టర్ అయి ఉన్నదని అధికారులు గుర్తించారు.
నవంబర్ 10న జరిగిన ఈ ఘటనపై ఎన్‌ఐఏ సమగ్ర దర్యాప్తు కొనసాగిస్తోంది. ఈ కుట్రలో పాల్గొన్న వ్యక్తులు, నెట్వర్క్‌లను గుర్తించేందుకు సాక్షులను విచారిస్తోంది. ఇప్పటివరకు 73 మంది సాక్షుల నుండి వివరాలు సేకరించిన ఎన్‌ఐఏ, ఢిల్లీ, జమ్మూ కశ్మీర్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర పోలీసులతో కలిసి దర్యాప్తును వేగవంతం చేస్తోంది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: