దేశ రాజధాని ఢిల్లీలోని(Delhi Blast) ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడు ఘటన వెనుక పెద్ద ఉగ్ర పన్నాగం దాగి ఉందని దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ఈ కేసులో వెలుగులోకి వచ్చిన వివరాల ప్రకారం, ఈ కుట్రకు వైట్‌కాలర్ డాక్టర్లు నాయకత్వం వహించినట్లు తేలింది. దేశంలోని నాలుగు ప్రధాన నగరాల్లో ఒకేసారి దాడులు జరిపేందుకు ప్రణాళిక రూపొందించినట్లు నిందితులు డాక్టర్ ఉమర్ నబీ, డాక్టర్ ముజమ్మిల్ గదుల నుంచి స్వాధీనం చేసిన డైరీల్లో ఆధారాలు లభించాయి.
Read Also: Health: చలికాలం లో చర్మం సాఫ్ట్‌గా ఉండాలంటే?
ఫరీదాబాద్‌లో ఉగ్ర కేంద్రం
దర్యాప్తు అధికారులు హర్యానా రాష్ట్రంలోని ఫరీదాబాద్‌లో ఉన్న అల్ ఫలా యూనివర్సిటీపై దృష్టి సారించారు. ఇక్కడి మెడికల్ కాలేజ్ బాయ్స్ హాస్టల్‌లోని 17వ బ్లాక్ ఉగ్ర కార్యకలాపాల ప్రణాళికలకు కేంద్రంగా ఉన్నట్లు విచారణలో తేలింది. ముఖ్యంగా ముజమ్మిల్‌కు చెందిన గది నంబర్ 13లోనే ఈ పథక రచన జరిగినట్లు నిర్ధారణ అయింది. అక్కడి నుంచి పోలీసులు రసాయనాలు, డిజిటల్ పరికరాలు, పెన్‌డ్రైవ్‌లు వంటి ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. యూనివర్సిటీ ల్యాబ్‌లోని రసాయనాలను ఉపయోగించి పేలుడు పదార్థాలు తయారు చేయాలనే యోచన ఉమర్, ముజమ్మిల్‌లకు ఉన్నట్లు అనుమానిస్తున్నారు.
డైరీల్లో కీలక వివరాలు
Delhi Blast: నిందితుల వద్ద లభించిన మూడు డైరీల్లో జమ్మూ కాశ్మీర్, ఫరీదాబాద్ ప్రాంతాలకు చెందిన సుమారు 25 మంది పేర్లు ఉన్నాయని అధికారులు తెలిపారు. అంతేకాక, నవంబర్ 8 నుండి 12 మధ్య తేదీలను ప్రస్తావించడం వల్ల ఆ కాలంలో దాడులు జరపాలని ప్రణాళిక ఉన్నట్లు భావిస్తున్నారు. ఈ కుట్రను అమలు చేయడానికి ఎనిమిది మంది సూసైడ్ బాంబర్లను సిద్ధం చేసినట్లు డైరీల వివరాల ద్వారా తేలింది. ప్రతి నగరంలో ఇద్దరు చొప్పున దాడి చేయాలని పథకం వేసినట్లు సమాచారం. ఈ ఎనిమిది మందిలో ఉమర్, ముజమ్మిల్‌తో పాటు డాక్టర్ అదిల్, డాక్టర్ షహీన్ కూడా ఉన్నారని పోలీసులు అనుమానిస్తున్నారు.
మీ అభిప్రాయం చెప్పండి
ఢిల్లీ పేలుడు వెనుక ఉగ్రవాద కుట్ర ఉందని భావిస్తున్నారా?
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: