దేశంలో లారెన్స్ బిష్ణోయ్ ఆగడాలు మితిమీరిపోతున్నాయి. ఇటీవల మీడియాలో వీరి పేరు తరచూగా వినిపిస్తోంది. సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పులు (firing) జరిగిన అనంతరం దేశవ్యాప్తంగా మారుమోగిన పేరు గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్. (Lawrence Bishnoi) ఆ తర్వాత ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ హత్య తర్వాత కూడా బిష్ణోయ్ గ్యాంగ్ సంచలనం సృష్టించింది. ప్రస్తుతం లారెన్స్ బిష్ణోయ్ గజరాత్ లోని సబర్మతి సెంట్రల్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే అతడి తమ్ముడు మరో గ్యాంగస్టర్ అన్మోల్ బిష్ణోయ్ ను (Anmol Bishnoi) అమెరికా బహిష్కరించింది. దీంతో అతడిని తాజాగా భారత్ కు తీసుకొచ్చారు. అతడితో పాటు మరో 199మందిని ఇండియాకు తరలించారు. వీళ్లలో ఇద్దరు పంజాబ్ వాంటెడ్ జాబితాలో ఉండగా.. మిగిలిన 197 మంది అక్రమంగా అమెరికాలో ఉంటున్నారు.
Read Also: Assigned lands : అసైన్డ్ భూములు కార్పొరేట్లకు అప్పగింత!

ఢిల్లీలో ల్యాండ్ అయిన విమానం
వీళ్లందరిని తరలిస్తున్న విమానం బుధవారం మధ్యాహ్నం ఢిల్లీలో (Delhi) ల్యాండ్ అయింది. ఎన్సీపీ నేత బాబా సిద్దిఖీ హత్య కేసుతో పాటు పలు కేసుల్లో అన్మోల్ బిష్ణోయ్ కీలక నిందితుడిగా ఉన్నాడు. అంతేకాదు గతేడాది ఏప్రిల్ లో సల్మాన్ ఖాన్ (Salman Khan) ఇంటి వద్ద కాల్పులు జరగగా.. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ అన్మోల్ బిష్ణోయ్ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడు. ఈ క్రమంలోనే ముంబయి పోలీసులు అతడిపై లుకౌట్ నోటీసులు జరీ చేశారు. 2022లో ప్రముఖ పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాల మర్డర్ కేసులో కూడా అన్మోల్ అభియోగాలు ఎదుర్కొంటున్నాడు. అయితే సిద్ధూ హత్యకు కొసెన్నిరోజుల ముందే ఫేక్ పత్రాలు వాడి అన్మోల్ దేశం విడిచి పారిపోయాడని నిఘా వర్గాలు తెలిపాయి.
అన్మోల్ పై 20 వరకు కేసులు
ఆయా ప్రాంతాల్లో అతడిపై దాదాపు 20 వరకు కేసులు నమోదయ్యాయి. అంతేకాదు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఎస్ఐఎ) అన్మోల్ గురించి సమాచారం చెప్పిన వాళ్లకి రూ.10లక్షల రివార్డు కూడా ప్రకటించింది. విదేశాల్లో ఉంటూ అతడు కార్యకలాపాలు నిర్వహిస్తుండేవాడు. అన్మోల్ ను భారత్ కు తీసుకొచ్చేందుకు ముంబయి పోలీసులు అనేక ప్రయత్నాలు చేశాడు. గతేడాది కూడా అతడు అమెరికా పోలలీసులకు చిక్కాడు. దీంతో ఎఎ అధికారులు అమెరికాలో ఉన్న ఎఫ్ బీఐ, డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీలతో సంప్రదింపులు జరిపారు. దీంతో అమెరికా అతడిని బహిష్కరించింది. బుధవారం అతడు భారత్ లో ల్యాండ్ అవ్వగానే ఎన్ఎస్ఐఎ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: