న్యూఢిల్లీ: విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తడం సాధారణమే కాగా, తాజాగా దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో (IGIA) సాంకేతిక సమస్య తలెత్తింది. శుక్రవారం ఉదయం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) వ్యవస్థలో లోపం కారణంగా విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ సమస్య వల్ల దాదాపు 100కు పైగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి.
Read Also: Weather Update:మొంథా తుఫాన్ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత

ఆటోమెటిక్ మెసేజ్ స్విచ్చింగ్ వ్యవస్థలో లోపం
అధికారిక వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం, విమానాశ్రయంలోని ఆటో ట్రాక్ సిస్టమ్‌కు సంబంధించిన సమాచారం అందించే ఆటోమెటిక్ మెసేజ్ స్విచ్చింగ్ వ్యవస్థ(Automatic message switching system) (AMSS) లో లోపం తలెత్తింది. దీంతో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లకు విమాన ప్రణాళికలు ఆటోమెటిక్‌గా అందడం లేదు. ప్రస్తుతం ఏటీసీ సిబ్బంది మాన్యువల్‌గా విమానాల షెడ్యూల్‌ను సిద్ధం చేస్తున్నారు. ఫలితంగా అనేక విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఈ సమస్యను పరిష్కరించేందుకు సాంకేతిక సిబ్బంది ప్రయత్నిస్తున్నారని, ఇందుకు కొన్ని గంటల సమయం పట్టొచ్చని అధికారిక వర్గాలు తెలిపాయి.
ఇతర విమానాశ్రయాలపై ప్రభావం
ఢిల్లీ విమానాశ్రయం(Delhi Airport) దేశంలోని అత్యంత రద్దీ విమానాశ్రయంగా (రోజుకు 1500 సర్వీసులు) పేరుగాంచింది. ఇక్కడ తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా లఖ్‌నవూ, జైపుర్, చండీగఢ్, అమృత్‌సర్ ఎయిర్‌పోర్టుల్లోనూ విమానాల రాకపోకలకు అంతరాయం కలిగే అవకాశం ఉంది. ఈ ఆలస్యంపై ఎయిర్‌లైన్స్(Airlines) ప్రయాణికులకు అడ్వైజరీలు జారీ చేశాయి. ఎయిర్‌పోర్టులోని చెక్‌ఇన్, ఇతర కౌంటర్ల వద్ద భారీ రద్దీ నెలకొనడంతో ప్రయాణీకులు అసౌకర్యానికి, ఆందోళనకు గురవుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: