Delhi air quality today : దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం మరోసారి ప్రమాదకర స్థాయికి చేరింది. మంగళవారం సాయంత్రం నుంచి నగరవ్యాప్తంగా కాలుష్య స్థాయిలు వేగంగా పెరిగి, అనేక ప్రాంతాలు ‘సివియర్’ వర్గంలోకి చేరాయి.
సెంట్రల్ పాల్యూషన్ కంట్రోల్ బోర్డు (CPCB) గణాంకాల ప్రకారం, ఆదివారం 279గా ఉన్న ఢిల్లీ సగటు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) సోమవారం 304కు పెరిగి, మంగళవారం రాత్రి 9 గంటలకు 390కు చేరింది.
నగరంలో ఉన్న 39 గాలి నాణ్యత పర్యవేక్షణ కేంద్రాల్లో 19 స్టేషన్లు 400కు పైగా AQI నమోదు చేశాయి. ఇది తీవ్రమైన ఆరోగ్యం దెబ్బతీసే స్థాయిగా నిపుణులు హెచ్చరిస్తున్నారు.
బురారి, ఆనంద్ విహార్, ముండ్కా, బావానా, వివేక్ విహార్, రోహిణి, సోనియా విహార్, అశోక్ విహార్, పంజాబీ బాగ్ తదితర ప్రాంతాల్లో తీవ్ర స్థాయి కాలుష్యం నమోదైంది.
ఢిల్లీ AQI అంచనా
ఢిల్లీ ప్రజలకు ఇంకా ఉపశమనంలేదు. (Delhi air quality today) ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ ప్రకారం, డిసెంబర్ 5 వరకు గాలి నాణ్యత ‘వెరీ పూర్’ స్థాయిలోనే కొనసాగనుంది.
అంతేకాకుండా, ఆ తర్వాత వచ్చే ఆరు రోజుల్లో కూడా కాలుష్య స్థాయిల్లో గణనీయమైన మెరుగుదల కనిపించే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.
Latest News: Bandi Sanjay: రేవంత్ వ్యాఖ్యలపై బండి సంజయ్ ఫైరింగ్
400కు పైగా AQI నమోదు అయిన స్టేషన్లు
CPCB యొక్క సమీర్ యాప్ ప్రకారం మంగళవారం రాత్రి 8 గంటల వరకు తీవ్ర కాలుష్యాన్ని నమోదు చేసిన ముఖ్యమైన కేంద్రాలు ఇవి :
ఆనంద్ విహార్, అశోక్ విహార్, (Delhi air quality today) బావానా, బురారి క్రాసింగ్, చాందనీ చౌక్, డీటీూ, జహంగీర్‌పురి, జవహర్లాల్ నెహ్రూ స్టేడియం, ముండ్కా, నెహ్రూ నగర్, ఒక్లా ఫేజ్-2, పాట్‌పర్‌గంజ్, పంజాబీ బాగ్, ఆర్‌కే పురం, రోహిణి, సిరి ఫోర్ట్, సోనియా విహార్, వివేక్ విహార్, వజీర్‌పూర్.
CPCB ప్రమాణాల ప్రకారం, AQI 0–50 మంచిదిగా, 51–100 సంతృప్తికరంగా, 101–200 మోస్తరు, 201–300 పూర్, 301–400 వెరీ పూర్, 401–500 సివియర్‌గా వర్గీకరించబడుతుంది.
కాలుష్యానికి ప్రధాన కారణంగా రవాణా రంగం
మంగళవారం ఢిల్లీలో స్థానిక కాలుష్యానికి (Delhi air quality today) ప్రధాన కారణంగా రవాణా రంగం నిలిచింది. పీటీఐ వార్తా సంస్థ నివేదిక ప్రకారం, మొత్తం కాలుష్యంలో 18.4 శాతం రవాణా రంగం నుంచే వచ్చింది.
అదే సమయంలో పరిసర ప్రాంతాలైన నోయిడా (8.2%), బాగ్‌పత్ (6.2%), గాజియాబాద్ (4.6%), పానిపట్ (3.3%), గురుగ్రామ్ (2.9%) నుండి వెలువడే ఉద్గారాలు కూడా ఢిల్లీ కాలుష్యానికి గణనీయంగా దోహదపడుతున్నాయి.
బుధవారం కూడా రవాణా ఉద్గారాల వల్ల కాలుష్యానికి 15.6 శాతం వరకు వాటా ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/