
Delhi AQI Today: దేశ రాజధాని ఢిల్లీలో నేడు ఉదయం తీవ్రమైన పొగమంచుతో కప్పబడి పోయింది. వాయు కాలుష్యం(Delhi Air Pollution) ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో నగరమంతా ఉక్కిరిబిక్కిరి అవుతోంది. గాలి నాణ్యత సూచీ (AQI) తీవ్ర స్థాయికి పడిపోవడంతో దృశ్యమానత గణనీయంగా తగ్గి రవాణా వ్యవస్థ పూర్తిగా ప్రభావితమైంది.
Read also: Lionel Messi: మెస్సితో హ్యాండ్ షేక్‌కి రూ.కోటి?

కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (Central Pollution Control Board) వెల్లడించిన వివరాల ప్రకారం, ఉదయం 6 గంటల సమయంలో ఢిల్లీలో AQI 456గా నమోదైంది. ఇది ఈ కాలంలో రెండో అత్యధిక స్థాయిగా అధికారులు తెలిపారు. ఆదివారం రోజున AQI 461కు చేరడం పరిస్థితి ఎంత తీవ్రమో సూచిస్తోంది. అక్షర్‌ధామ్ ప్రాంతంలో 493గా, బారాఖంబా రోడ్డులో 474గా గాలి నాణ్యత సూచీ నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.
కాలుష్య మేఘంలో ఢిల్లీ నగరం
దట్టమైన పొగమంచు కారణంగా ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సుమారు 100 విమానాలు రద్దుకాగా, 300కు పైగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యాన్ని ఎదుర్కొంటున్నారు. అదే సమయంలో 90కు పైగా రైళ్లు 6 నుంచి 7 గంటల వరకు ఆలస్యమవుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ(Delhi Air Pollution) ఎయిర్‌పోర్ట్‌తో పాటు ఇండిగో, ఎయిర్ ఇండియా సంస్థలు ప్రయాణికులకు అప్రమత్తత సూచనలు జారీ చేశాయి.
ఢిల్లీ–ఎన్‌సీఆర్‌లో నిర్మాణాలపై నిషేధం
పరిస్థితిని నియంత్రించేందుకు వాయు నాణ్యత నిర్వహణ కమిషన్ (CAQM) గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP)లో అత్యంత కఠినమైన స్టేజ్–IV ఆంక్షలను అమలు చేసింది. ఢిల్లీ–ఎన్‌సీఆర్ ప్రాంతంలో నిర్మాణ, కూల్చివేత పనులన్నింటినీ నిలిపివేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో సగం మంది ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అమలు చేయాలని ఆదేశించారు. 10వ తరగతి మినహా మిగతా తరగతులకు హైబ్రిడ్ విధానంలో బోధన చేపట్టాలని పాఠశాలలకు సూచించారు. ఇదిలా ఉండగా, భారత వాతావరణ శాఖ ఢిల్లీకి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: