Dehradun cloudburst నగరాన్ని వీధులపైకి కొట్టుకొచ్చిన వరదలు, జాతీయ రహదారిపై వంతెన ధ్వంసం
Dehradun cloudburst : మంగళవారం తెల్లవారుజామున దెహ్రాడూన్‌లో (Dehradun cloudburst) కురిసిన భారీ వర్షాలు క్లౌడ్‌బర్స్ట్‌గా మారి నగరాన్ని అతలాకుతలం చేశాయి. అనూహ్యంగా వచ్చిన ఈ వర్షాలు ఫ్లాష్‌ఫ్లడ్స్‌కి దారితీసి భారీ నష్టాన్ని మిగిల్చాయి.
ఉత్తరాఖండ్ డెంటల్ కాలేజ్ సమీపంలోని వంతెన కూలిపోయింది.
ఒక రాత్రి పాటు కురిసిన వర్షాలతో దెహ్రాడూన్–హరిద్వార్ జాతీయ రహదారిపై ఫన్ వ్యాలీ దగ్గర, ఉత్తరాఖండ్ డెంటల్ కాలేజ్ సమీపంలోని వంతెన కూలిపోయింది. దీంతో రహదారి రవాణా అంతరాయం కలిగి, అనేక మంది ప్రయాణికులు ఇరుక్కుపోయారు. అధికారులు హై అలర్ట్‌లో ఉండి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఘటనాస్థలంలోని భయంకర దృశ్యాలు నీరు వేగంగా ప్రవహించి పరిసర ప్రాంతాలకు ముప్పు తెచ్చినట్లు చూపించాయి.
ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ ఈ పరిణామంపై ఆందోళన వ్యక్తం చేశారు
సహస్రధారా ప్రాంతంలో అనేక దుకాణాలు, హోటళ్లు దెబ్బతిన్నట్లు పేర్కొన్నారు. “దెహ్రాడూన్‌లో సహస్రధారాలో భారీ వర్షాల కారణంగా కొన్ని దుకాణాలు దెబ్బతిన్న వార్త విచారకరం. జిల్లా పరిపాలన, SDRF, పోలీసులు ఇప్పటికే సంఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపడుతున్నారు. నేను వ్యక్తిగతంగా ఈ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాను. అందరూ క్షేమంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను” అని Xలో పోస్ట్ చేశారు.
మార్కెట్‌లోకి నీరు దూసుకువెళ్ళి అనేక వ్యాపార కేంద్రాలను ధ్వంసం చేసింది
సహస్రధారా నది ఉప్పొంగి ప్రధాన మార్కెట్‌లోకి నీరు దూసుకువెళ్ళి అనేక వ్యాపార కేంద్రాలను ధ్వంసం చేసింది. మరోవైపు, నగరంలోని తంసా నది ఉప్పొంగి తప్కేశ్వర్ మహాదేవ్ ఆలయం ప్రాంగణం వరద నీటిలో మునిగిపోయింది. నీరు హనుమాన్ విగ్రహం వరకు ఎగబాకింది. అయితే గర్భగుడి మాత్రం సురక్షితంగా ఉంది. ఆలయ పూజారి ఆచార్య బిపిన్ జోషి మాట్లాడుతూ – “ఉదయం 5 గంటల నుంచే నది ఉధృతంగా ప్రవహించడం మొదలైంది. మొత్తం ఆలయ ప్రాంగణం నీటిలో మునిగిపోయింది. ఇంతటి పరిస్థితి చాలా ఏళ్లుగా చూడలేదు. వివిధ ప్రదేశాల్లో నష్టం జరిగింది. ఈ సమయంలో ప్రజలు నదుల దగ్గరికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మానవ నష్టం ఏదీ జరగలేదు” అని తెలిపారు.
Read also :