భారతీయ తపాలా శాఖ వినియోగదారుల సౌలభ్యార్థం ‘డాక్ సేవా’(Dak seva) మొబైల్ యాప్‌ను ప్రారంభించింది. ఈ యాప్ ద్వారా రిజిస్టర్డ్ పోస్ట్, స్పీడ్ పోస్ట్ ట్రాకింగ్, పోస్టేజ్ ఛార్జీల లెక్కింపు, సమీప పోస్టాఫీసుల వివరాలు, బీమా, పొదుపు పథకాల వడ్డీ లెక్కింపు వంటి ఎనిమిది సేవలు పొందవచ్చు.
Read Also: Bypoll Elections: హాట్ సీటు జూబ్లీహిల్స్ ఉపఎన్నిక: తుది దశలో ఉత్కంఠ

సులభమైన డిజిటల్ సేవలు
ఈ యాప్‌ను సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ పోస్టల్ టెక్నాలజీ (CEPT) రూపొందించింది. గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్‌లలో ఉచితంగా అందుబాటులో ఉంది. వినియోగదారులు తమ మొబైల్(Dak seva) ద్వారా పోస్టల్ సేవలను ఎప్పుడైనా, ఎక్కడైనా పొందవచ్చు.
H2: ప్రధాన ఫీచర్లు
- రిజిస్టర్డ్, స్పీడ్ పోస్ట్ ట్రాకింగ్
- సమీప పోస్టాఫీసు వివరాలు
- పోస్టేజ్ ఛార్జీల లెక్కింపు
- PLI, RPLI బీమా వివరాలు
- పొదుపు పథకాల వడ్డీ లెక్కింపు
- కార్పొరేట్ సేవలు
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: